రేపు వినాయక చవితి. అంటే బొజ్జ గణపయ్య పుట్టిన రోజు.
హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో వినాయక చవితి ఒకటి.ఇప్పటికే గ్రామాల్లో, పట్టణాల్లో చవితి ఉత్సవాలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక వినాయక చవితి నాడు అందంగా మెరిసిపోవాలని మగువలు తెగ ఉత్సాహ పడుతుంటారు.కానీ, అందుకోసం ఏం చేయాలో తెలియక మరోవైపు మదన పడిపోతూ ఉంటారు.
అయితే వర్రీ వద్దు.ఈ రోజు రాత్రికి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే రేపటి ఉదయానికి ముఖం అందంగా మరియు కాంతివంతంగా మారుతుంది.
మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటో ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక అరటి పండును తీసుకుని తొక్కను తొలగించి.
సన్నగా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి.అలాగే అర అగుంళం అల్లం ముక్కను తీసుకుని పీల్ తొలగించి వాటర్‌తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు ముక్కలు, అల్లం ముక్కలు, ఐదు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్, మూడు టేబుల్ స్పూన్ల పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్ ను వేసి బాగా కలపాలి.ఆపై ఈ మిశ్రమాన్ని నైట్ నిద్రించడానికి గంట ముందు ఏదైనా బ్రష్ సాయంతో ముఖానికి, మెడకు అప్లై చేసుకుని.ఆరబెట్టుకోవాలి.
పూర్తిగా డ్రై అయిన అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని టవల్‌తో తుడుచుకోవాలి.ఆపై ఏదైనా మాయిశ్చరైజర్ లేదా సీరమ్ ను అప్లై చేసుకుని పడుకోవాలి.
ఈ సింపుల్ రెమెడీని ట్రై చేశారంటే.రేపటికి మీ ముఖం అందంగా, ఆకర్షణీయంగా మారుతుంది.







