శరీరంలో మలినాలు పేరుకుపోయే కొద్ది వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు పెరిగిపోతూ ఉంటాయి.అందుకే ఎప్పటికప్పుడు శరీరం పైనే కాదు లోపల కూడా శుద్ధి చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
అయితే మలినాలను పోగొట్టి బాడీని క్లీన్ చేయడంలో ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఆ పవర్ ఫుల్ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన క్యారెట్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్ అశ్వగంధ పొడి వేసుకోవాలి.
చివరిగా ఒక గ్లాస్ బాదం పాలు, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన హెల్తీ అండ్ టేస్టీ డిటాక్స్ డ్రింక్ సిద్ధమవుతుంది.

ఈ డిటాక్స్ డ్రింక్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకోవాలి.ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు, మలినాలు బయటకు తొలగిపోతాయి.బాడీ క్లీన్ గా మారుతుంది.
పైగా ఈ డీటాక్స్ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
కంటి చూపు మెరుగుపడుతుంది.మెదడు మునుపటి కంటే వేగంగా పని చేస్తుంది.
ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతాయి.మరియు చర్మం ఎల్లప్పుడూ నిగారింపుగా, కాంతివంతంగా కూడా మెరుస్తుంది.
కాబట్టి తప్పకుండా ఈ పవర్ ఫుల్ డిటాక్స్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.