Deepti Sunaina: మేకప్ బాగుంది యాక్టింగ్ కూడా చెసింటే బాగుండు.. దీప్తి సునైనాపై నెటిజన్స్ ట్రోల్స్!

సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన గురించి అందరికి పరిచయమే.వర్డల్ బిగ్గెస్ట్ షో బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొని ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

 Netizens Comments Viral On Deepth Sunaina Devil Makeup Details, Deepti Sunaina,-TeluguStop.com

హౌస్ లో ఉన్నంత కాలం బాగా అల్లరి చేస్తూ, ఎమోషనల్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.దీంతో బాగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

ఇక తొలిసారిగా డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో బాగా మెప్పించి గుర్తింపు తెచ్చుకుంది.

బిగ్ బాస్ లో అవకాశం అందుకోగా తన కెరీర్ మొత్తం బిగ్ బాస్ తో మొదలైందని చెప్పవచ్చు.ఇక పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ లు అందుకుంది.

ఈమె మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా చేసింది.వీరిద్దరూ కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేశారు.

అలా వీరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది.అలా లవ్ గా మారింది.

కానీ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న షణ్ముఖ్ మితిమీరి ప్రవర్తించడంతో ఇక షన్ను తో తన రిలేషన్ కరెక్ట్ కాదని బ్రేకప్ చెప్పుకుంది.

ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని షాక్ ఇచ్చింది.వీళ్ళ ఫాలోవర్స్ కూడా ఈ విషయాన్ని తట్టుకోలేక పోయారు.మొత్తానికి ఈమె రిఫ్రెష్ అయ్యింది.

ఇక ఈమె చేసే డ్యాన్సులు చూస్తే మాత్రం మతి పోవాల్సిందే.తన నడుము అందాలతో తెగ స్టెప్పులు వేస్తూ అందర్నీ తన వైపు మలుపుకుంటుంది.

ఏదైనా కొత్త పాట వస్తే చాలు వెంటనే సందడి చేయకుండా ఉండదనే చెప్పాలి.అప్పుడప్పుడు మనసుకు టచ్ అయ్యే కొటేషన్స్ పెడుతూ ఉంటుంది.

అవి ఎవరిని ఉద్దేశించి పెడుతుందో కానీ అవి బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పంచుకుంది.అందులో తాను దయ్యం లాగా తయ్యారవ్వగా తన మేకప్ తో తనను దడేల్ పుట్టించింది.ఇక ఆ పోస్ట్ వైరల్ అవ్వగా తన ఫేస్ చూసి.

నెటిజన్స్ వామ్మో.దీప్తి ఏంటి ఇలా తయారైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఓ నెటిజన్ మేకప్ బాగుంది కానీ.యాక్టింగ్ కూడా చెసింటే బాగుండు.అంటూ నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇక మిగతా నెటిజన్స్ కూడా రకరకాల కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక దీప్తి ప్రస్తుతం ఫోటో షూట్ లతో పాటు కొన్ని ప్రాజెక్ట్ లలో బాగా బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube