ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాల్లో( Vontimitta Kodanda Rama’s Brahmotsavam ) భాగంగా ఆరవ రోజున ఉదయం సమయంలో రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒంటిమిట్ట పరవీధుల్లో సీతారామలక్ష్మణులు( Sitarama Lakshmana ) విహరించారు.
ఇక ఈ రథోత్సవ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.ఈ రథోత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని రథాన్ని లాగేందుకు చాలా పోటీ పడ్డారు.
అంతేకాకుండా శ్రీరామ.జయజయరామ.జానకి రామ.అంటూ శ్రీరాముని స్మరిస్తూ రథాన్ని ముందుకు తీసుకెళ్లారు.ఇక మహిళలు యువకులు, వృద్ధులు ఇలా ఒంటి మిట్ట( Vontimitta ) ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా హాజరై రథోత్సవాన్ని తిలకించారు.ఇక పురవీధుల్లో ఈ కార్యక్రమం జరగడంతో ఒంటిమిట్ట ప్రజలు ఎంతో పులకించిపోయారు.
ఈ కార్యక్రమంలో చెక్కభజనలు, భజంత్రీలు, మోగిస్తూ కళాకారులు నృత్యాలు చేశారు.
ఇక కోదండరాముడు రథోత్సవ కార్యక్రమాన్ని సాంప్రదాయ రీతిలో టీటీడీ అధికారులు ( TTD officials )అలాగే వేద పండితుల ఆధ్వర్యం లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.ఇక అక్కడి స్థానిక తహసీల్దారు శ్రీనివాసులు రెడ్డి ( Tehsildar Srinivasulu Reddy )కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.అలాగే రథచక్రాన్ని పర్యవేక్షించే ఆచారికి బియ్యం, భత్యం, వస్త్రాలను సమర్పించి సత్కరించారు.
అంతేకాకుండా ప్రత్యేకమైన పూజలు నిర్వహించి రథాన్ని పురవీధుల్లో ఊరేగించారు.
అసలు చెప్పాలంటే శరీరమే రథం, బుద్ధిసారథి మనసు పగ్గం, ఇంద్రియాలు గుర్రాలు, విషయాలే వీధులు.ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరు అని అలాగే ఆత్మ ఇందుకు భిన్నం అని ఆత్మనాత్మ వివేకం కలుగుతుంది.అంతేకాకుండా రథోత్సవం జరిపిస్తే ముఖ్యంగా కలిగే తత్వ జ్ఞానం ఇదే.అందుకే రథోత్సవాన్ని బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం తర్వాత అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు.అలాగే సీతారామ లక్ష్మణ రథాన్ని లాగి దర్శించుకునే భక్తులకు అన్ని విధాల శుభం కలుగుతుంది.
LATEST NEWS - TELUGU