పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటించిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసింది.ఎట్టకేలకు ఈ రోజు ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది.
ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది.క్రిటిక్స్ మాత్రం నెగిటివ్ రాసిన ప్రేక్షకుల నుండి మాత్రం మిశ్రమ స్పందన లభించింది.
కాల్స్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎక్కువుగా ఈ సినిమాను మెచ్చారు.ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా కనీసం 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ సాధిస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే.
అయితే గత ఏడాది రిలీజ్ అయిన పుష్ప సినిమా మొదట్లో ఇలాగె మిశ్రమ స్పందన వచ్చింది.అయితే మెజారిటీ ఆడియెన్స్ కు ఈ సినిమా నచ్చడంతో తర్వాత తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
అలాగే ఇప్పుడు పుష్ప మ్యాజిక్ ను రాధేశ్యామ్ రిపీట్ చేస్తుందని ప్రభాస్ అభిమానులు ఊహాగానం వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప సినిమా ఎలాగైతే అల్లు అర్జున్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో అలాగే రాధేశ్యామ్ కూడా అలాగే ప్లాప్ నుండి హిట్ లోకి మారుతుందని డార్లింగ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తునాన్రు.మరి నిజంగానే పుష్ప మ్యాజిక్ రాధేశ్యామ్ రిపీట్ చేస్తుందా లేదా అనేది ముందు ముందు చూడాలి.

ఫస్ట్ వీకెండ్ వరకు రాధేశ్యామ్ కలెక్షన్లకు ఢోకా లేకపోయినా వీకెండ్ తర్వాత కలెక్షన్స్ కు ఢోకా లేకపోయినా వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ ను బట్టి ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.ఇక ఈ సినిమా ప్రేమకి విధికి మధ్య సాగిన కథ. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో పామిస్ట్ గా నటించాడు.పూజా ప్రేరణ పాత్రలో నటించింది.వీరిద్దరూ అయితే వారి పాత్రలకు న్యాయం చేసింది.మరి చూడాలి ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ అవుతుందో లేదో.







