పరిగడుపున పచ్చి కరివేపాకును.. తింటే ఈ ఆరోగ్య సమస్యలు దూరం..

భారత దేశ ప్రజలు ప్రతి రోజూ చేసే వంటలలో కరివేపాకును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణ భారత వంటకాలలో దీన్ని అధికంగా ఉపయోగిస్తారు.

 If You Eat Green Curry Leaves In The Morning, These Health Problems Will Go Away-TeluguStop.com

కరివేపాకు సహాయంతో వంటకం మంచి రుచిని పొందుతుంది.చాలా మంది కరివేపాకును మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు.

కొంత మంది ఇంట్లోనే వాటిని నాటుకుంటూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే భాస్వరం,కాల్షియం,ఇనుము, రాగి, విటమిన్లు మరియు మెగ్నీషియం వంటి పోషకాలు కరివేపాకులో ఎన్నో ఉన్నాయి.

శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కరివేపాకు అందిస్తుంది.ఉదయాన్నే పరగడుపున మూడు నుంచి నాలుగు ఆకులను తింటే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కరివేపాకు ఇలా తినడం వల్ల రాత్రి అంధత్వం లేదా ఇతర కంటి సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి.

ఎందుకంటే ఇందులో కళ్లకు అవసరమైన విటమిన్ ఏ అధికంగా ఉంటుంది.ఈ విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది.మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా ఈ ఆకును నమలడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఎందుకంటే ఇందులో హైపోగ్లైసీమిక్ పదార్థాలు ఉంటాయి.ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేస్తుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆకులను ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

అంతే కాకుండా దీని తో పాటు మల బద్ధకం, గ్యాస్ వంటి అనేక జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.ఇంకా చెప్పాలంటే ఈ ఆకులను తినడం వల్ల అధిక బరువు మరియు పొట్ట చుట్టూ ఉన్న అధిక కొవ్వు తగ్గుతుంది.ఎందుకంటే ఇందులో ఇథైల్ అసిటేట్ మహానింబైన్ మరియు డైక్లోరోమీథేన్ వంటి పదార్థాలు ఉంటాయి.

ఇలాంటివన్నీ మనిషి శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube