సమ్మర్ సీజన్ రానే వచ్చింది.రోజు రోజుకు ఎండల తీవ్రత పెరిగి పోతోంది.
మార్చి నెల నుంచే భానుడు భగ భగ మంటూ.ప్రజలను హడలెత్తిస్తున్నాడు.
ఇక ఈ ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది వాటర్‌తో పాటుగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసు కుంటుంటారు.అయితే సమ్మర్ సీజన్‌లో ఇబ్బంది పెట్టే అతి దాహం, శరీర ఉష్ణోగ్రతలు పెరిగి పోవడం, వడదెబ్బ ఇలాంటి సమస్యల నుంచి రక్షించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడటంలో కొన్ని కొన్ని జ్యూస్‌లు ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.
మరి ఆ బెస్ట్ జ్యూసులు ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా జ్యూస్ వేసవి కాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
శరీరాన్ని చల్ల బరచడంలోనూ, నీరసం మరియు అలసట సమస్యలను దూరం చేయడంలో పుదీనా అద్భుతంగా సహాయపడుతుంది.అందువల్ల, ఫ్రెష్‌గా ఉండే పుదీనా ఆకులతో జ్యూస్ తయారు చేసుకుని.
సమ్మర్‌లో ప్రతి రోజు తీసుకుంటే మంచిది.
అలాగే పుచ్చకాయ జ్యూస్ కూడా సమ్మర్‌లో తీసుకోవాల్సిన బెస్ట్ జ్యూస్.అధిక దాహం, వడదెబ్బ వంటి సమస్యలు దరి చేరకుండా చేయడంలో పుచ్చకాయ జ్యూస్ గ్రేట్‌గా సహాయపడుతుంది.కాబట్టి, రెగ్యులర్‌గా లేదా రెండు రోజులకు ఒక సారి పుచ్చకాయ జ్యూస్ తీసుకుంటే మీ ఆరోగ్యం పదిలం ఉంటుంది.
సమ్మర్ సీజన్‌లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన జ్యూసుల్లో కర్బూజ జ్యూస్ కూడా ఒకటి.శరీరాన్ని చల్ల బరచడమే కాకుండా… వేసవి తాపాన్ని తగ్గించి ఉపశమనాన్ని కలిగించడంతో కర్బూజ జ్యూస్ ఉపయోగ పడుతుంది.
అలాగే ఈ వేసవిలో చర్మాన్ని యవ్వనంగా మరియు కాంతి వంతంగా ఉంచడంలోనూ కర్బూజ జ్యూస్ సహాయ పడుతుంది.కాబట్టి, తరచూ కర్బూజ జ్యూస్ తీసుకుంటే మంచిది.ఇక వీటిలో పాటుగా క్యారెట్, బత్తాయి, దానిమ్మ, అరటి పండు, కీరా, టమాటా, గ్రీన్ యాపిల్ జ్యూసులను కూడా డైట్‌లో చేర్చుకుంటే.ఈ హాట్ హాట్ సమ్మర్‌ను కూల్ కూల్‌గా మార్చుకోవచ్చు.