మన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాల్లో ఐరన్ ఒకటి.శరీరంలో ఎప్పుడైతే ఐరన్ కొరత ఏర్పడుతుందో.
ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టేస్తాయి.ముఖ్యంగా రక్తహీనత, బరువు పెరగడం, నీరసం, అలసట, ఏకాగ్రత లోపించడం, అధిక ఆకలి తదితర సమస్యలన్నీ తలెత్తుతూ ఉంటాయి.
అందుకే శరీరానికి సరిపడా ఐరన్ ను కచ్చితంగా అందించాలి.అయితే ఐరన్ లోపాన్ని నివారించడానికి ఇప్పుడు చెప్పబోయే స్మూతీ అద్భుతంగా సహాయపడుతుంది.
ఐరన్ పుష్కలంగా ఉండే ఈ స్మూతీని తీసుకుంటే అధిక బరువు నుంచి రక్తహీనత వరకు ఎన్నో సమస్యలు పరార్ అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఐరన్ స్మూతీ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక యాపిల్ ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.
అలాగే అర కప్పు సీడ్ లెస్ బ్లాక్ గ్రేప్స్ తీసుకుని వాటర్ తో కడిగి పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కడిగి పెట్టుకున్న బ్లాక్ గ్రేప్స్, కట్ చేసి పెట్టుకున్న ఆపిల్ ముక్కలు, ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పాలకూర ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు పుచ్చ గింజలు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపితే మన ఐరన్ రిచ్ స్మూతీ సిద్ధం అవుతుంది.
ఈ యాపిల్ గ్రేప్ పాలక్ స్మూతీని డైట్ లో కనుక చేర్చుకుంటే రక్తహీనత సమస్య నుంచి కొద్ది రోజుల్లోనే బయటపడతారు.వెయిట్ లాస్ అవుతారు.నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మెదడు చురుగ్గా పని చేస్తుంది.
ఏకాగ్రత రెట్టింపు అవుతుంది.ఎముకలు దృఢంగా మారతాయి.
రోగ నిరోధక వ్యవస్థాపన బలపడుతుంది.మరియు ఐ సైట్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.
కాబట్టి, తప్పకుండా పైన చెప్పుకున్న యాపిల్ గ్రేప్ పాలక్ స్మూతీని డైట్ తో చేర్చుకోండి.