సుకుమార్( Sukumar ) లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.పాన్ ఇండియాలో ఆయన చేసిన ‘పుష్ప 2’( Pushpa 2 ) సినిమా భారీ విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది.
మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు.ఇక ఆయన రామ్ చరణ్( Ram Charan ) తో తన తర్వాత సినిమాను చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్( Allu Arjun ) కి భారీ సక్సెస్ ని అందించిన సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోయే సినిమాతో మరొక సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.
మరి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం ‘( Rangasthalam Movie ) సినిమా మంచి విజయాన్ని సాధించింది.అయితే ఇప్పుడు రాబోయే సినిమాను కూడా అలాంటి ఒక పల్లెటూరు నేపథ్యంలోనే తెరకెక్కించాలని చూస్తున్నారట.
ఇక ఇప్పటికే సుకుమార్ రామ్ చరణ్ కి కథను కూడా వినిపించాడట… ఇక బుచ్చిబాబు సినిమా అయిపోయిన వెంటనే రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో జయిన్ అబ్బబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక అప్పటివరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసి సెట్స్ కూడా వేయించి రెడీగా ఉంచుతానని సుకుమార్ రామ్ చరణ్ కి మాటిచ్చినట్టుగా తెలుస్టింది.
మరి వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతుందనేది తెలియాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ను( Sreeleela ) తీసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మరి రామ్ చరణ్ శ్రీలీల కాంబినేషన్ లో ఇంతవరకు సినిమా అయితే రాలేదు.
కాబట్టి ఈ సినిమాలో ఆమె నటిస్తే ఇద్దరి కాంబినేషన్ చూడ్డానికి బాగుంటుంది.అలాగే సినిమా సక్సెస్ అయితే శ్రీలీలా కి కూడా మంచి బ్రేక్ అయితే దొరుకుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా చేయడానికి ఆయన అంగీకరించినట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే ‘పుష్ప 2’ సినిమాలో ఐటమ్ గర్ల్ గా మెరిసిన ఆమె ఇప్పుడు రామ్ చరణ్ పక్కన ఆడి పాడడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇంకా సుకుమార్ అయితే దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే ఇవ్వలేదు.మరి ఇందులో హీరోయిన్ గా చేసే అవకాశం శ్రీలీలకు వస్తుందా లేదంటే మరొక హీరోయిన్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది…
.