టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్( Sukumar ) కూతురు సుకృతి వేణి( Sukriti Veni ) మెయిన్ లీడ్ లో ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది.గాంధీ తాత చెట్టు( Gandhi Tatha Chettu ) అనే ఈ సినిమా ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకుంది.
ఈ సినిమాని జనవరి 24న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్.దీంతో నేడు ఈ సినిమా ప్రెస్ మెట్ నిర్వహించారు.
అయితే ఈ సినిమా కోసం సుకృతి గుండు కూడా కొట్టించుకుంది.సినిమాలోనే తనకి గుండు కొట్టించే సీన్ ఉంటుంది.
ఈ ప్రెస్ మీట్ లో సుకుమార్ భార్య తబిత( Thabitha ) మాట్లాడుతూ.డైరెక్టర్ కూతురు కాబట్టి సినిమాల్లోకి వస్తుంది అనుకోకూడదు.
ఈ సినిమా అవార్డులకు వెళ్తే చాలు అనుకున్నాను.
అందరూ అభినందించడం మొదలయ్యాక ఈ సినిమా అందరికి చేరుకోవాలని అనుకున్నాను.ఆయన్ని దగ్గర ఉండి టేక్ కేర్ చేయాలనుకుంటున్నాను కానీ సుకుమార్ నన్ను షూటింగ్స్ కి రానివ్వడు.అందుకే ఈ సినిమా షూటింగ్ కి వెళ్ళను.
నాకు కథ సుకుమార్ పంపించాక నా కూతురికి ఇస్తే చదివి బాగుంది అని చెప్పింది అంతే.తను చేస్తా అని చెప్పలేదు.
తర్వాత డైరెక్టర్, నిర్మాతలతో తనే మాట్లాడుకొని ఓకే చేసింది.మొదట నా కూతురి ట్యాలెంట్ నేను గమనించలేదు.
నా కూతురు ఫస్ట్ షాట్ చూసి సుకుమార్ కి కాల్ చేసి చాలా బాగా చేస్తుంది అని ఎగ్జైట్ అయ్యాను అని తెలిపింది.
అనంతరం ప్రెస్ మీట్ లో భాగంగానే తన కూతురు గుండు గీయించుకోవడం గురించి మాట్లాడుతూ.ఈ సినిమాలో సాంగ్స్, తను హెయిర్ షేవ్ చేసుకున్నది చూస్తుంటే ఎమోషనల్ అయ్యాను.తను ఈ సినిమా చేస్తున్నప్పుడు 12 ఏళ్ళు.
తనని చూసి గర్వపడుతున్నాను.టీన్స్ లో ఉన్న ఏ అమ్మాయి కూడా తన హెయిర్ షేవ్ చేసుకోడానికి ఒప్పుకోదు.
కానీ తను చేసింది.తను మల్టీ ట్యాలెంటెడ్ పాడగలదు, నటించగలదు.
ఏదైనా చేయగలదు అంటూ కూతురి గురించి చెప్తూ స్టేజిపైనే ఏడ్చేసింది.దీంతో సుకుమార్ స్టేజిపైకి వచ్చి భార్యని ఓదార్చాడు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంత చిన్న వయసులోనే సినిమాల పట్ల తనకున్న డెడికేషన్ ను చూసి సుకృతి పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.