Hair Fall Hair Pack : వారంలో ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ ఫాల్ తో సహా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

ఆరోగ్యమైన మరియు ఒత్తైన జుట్టు కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి.కానీ ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, కాలుష్యం, పోషకాల కొరత, జుట్టు సంరక్షణ లేకపోవడం, రెగ్యులర్ గా షాంపూ చేసుకోవడం వంటి కార‌ణాల వ‌ల్ల‌ జుట్టు రాలడం, చిట్లడం, విరగడం, చుండ్రు త‌దిత‌ర సమస్యలు వేధిస్తూ ఉంటాయి.

 If You Follow This Remedy Once A Week, You Can Check Many Problems Including Hai-TeluguStop.com

అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని వారంలో ఒక్కసారి పాటిస్తే కనుక హెయిర్ ఫాల్ తో సహా ఎన్నో జుట్టు సంబంధిత సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు కొబ్బరి ముక్కలు, ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి ప‌ల్చ‌టి వస్త్రం సహాయంతో కొబ్బరి పాలను సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత ఒక బౌల్ ను తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

చివరగా సరిపడా కొబ్బరి పాలను పోసుకుని లూజ్ స్ట్రక్చర్ లో మున‌గాకు పొడిని కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంట లేదా గంటన్నర అనంతరం రసాయనాలు తక్కువగా ఉండే షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెడ్ బాత్ చేయాలి.

Telugu Care, Care Tips, Damage, Fall, Pack, Remedy, Latest, Long, Thick-Telugu H

వారంలో ఒక్కసారి ఈ విధంగా హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.డ్రై హెయిర్ సమస్యకు స్వస్తి చెప్పొచ్చు.

మరియు ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల జుట్టు చిట్ల‌డం, విరగడం వంటివి తగ్గుతాయి.మరియు కురులు ఒత్తుగా, పొడుగ్గా సైతం పెరుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube