అయ్యో పాపం.. కళ్యాణ్ దేవ్ కి ఎంత కష్టం వచ్చింది?

ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ గా కొనసాగుతున్న మెగా ఫ్యామిలీ కి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కోట్లల్లో అభిమానులు ఉన్నారు కాబట్టే మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలు వచ్చినా ప్రస్తుతం సక్సెస్ఫుల్గా రాణించగలుగుతున్నారు.

 Kalyan Dev Movie Career Problems , Kalyan Dev ,mega Family , Kalyan Dev Movie C-TeluguStop.com

ఇప్పటికే ఇక మెగా మేనల్లుళ్ళు, వారసులు ఎంతోమంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.ఇదే రీతిలో మెగాస్టార్ కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

Telugu Kalyan Dev, Shreeja, Kinnerasani, Talluri Ram, Vijetha-Telugu Stop Exclus

మెగా కాంపౌండ్ హీరో కావడంతో అతనికి కూడా అభిమానులు అందరూ కూడా బ్రహ్మరథం పట్టారు అనే చెప్పాలి.ఇక మెగా అల్లుడు అయ్యాడో లేదో అప్పటికే అతనితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు క్యూ కట్టారు.ఇక విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ కు మెగా హీరోలు అందరూ కూడా సపోర్ట్ చేశారు.ఎంత సపోర్ట్ చేసిన హిట్ మాత్రం కొట్టలేకపోయాడు.

ఇక వరుసగా రెండు మూడు సినిమాలు కళ్యాణ్ దేవ్ లైన్ లో పెట్టాడు.కానీ అంతలోనే అతడికీ కష్టకాలం వచ్చేసింది.

మెగా డాటర్ శ్రీజ కళ్యాణ్ కి మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం మొదలైంది.

Telugu Kalyan Dev, Shreeja, Kinnerasani, Talluri Ram, Vijetha-Telugu Stop Exclus

ఇక మెగా ఫ్యామిలీతో కళ్యాణ్ దేవ్ కనిపించి కూడా చాలా రోజులు అయింది.ఇక ఇటీవలే శ్రీజ కళ్యాణ్ దేవ్ లు ఇద్దరి పుట్టినరోజులు జరిగితే సోషల్ మీడియా లో ఒకరికి ఒకరు కనీసం బర్త్ డే శుభాకాంక్షలు కూడా చెప్పుకో లేదనే చెప్పాలి.ఇకపోతే మెగా బ్యాక్గ్రౌండ్ మీద నమ్మకంతో కళ్యాణ్ కొత్త సినిమా తీసిన నిర్మాతలకు షాక్ తగిలింది అని తెలుస్తుంది.

కళ్యాణ్ ప్రస్తుతం కిన్నెరసాని సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాకు తాళ్లూరి రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సినిమా ట్రైలర్ కూడా విడుదల అయింది.అయితే ఇప్పుడు సినిమా రిలీజ్కు సిద్ధమవుతోంది.

కానీ ఎవరూ కూడా కొనేందుకు ఆసక్తి చూపడం లేదట.ఇక నిర్మాతకు సీన్ అర్థమైపోయి ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయాడు అని తెలుస్తుంది.

జూన్ పదవ తేదీన విడుదల కాబోతుంది ఈ సినిమా.ఈ విషయం తెలిసి అయ్యో పాపం మెగా ఫ్యామిలీ అండతో పెద్ద హీరో గా మారాలి అనుకున్న కళ్యాణ్ కు ఎంతకష్టకాలం వచ్చింది అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube