ప్రస్తుతం అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.ప్రపంచదేశాల ప్రజలను ముప్ప తిప్పలు పెడుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో ప్రాణం పోసుకున్న ఈ ప్రాణాంతక కరోనా వైరస్.చిన్నా, పెద్ద, సామాన్యుడు, సెలబ్రెటీ అనే తేడా లేకుండా అందరిపై దాడి చేస్తోంది.
ఈ క్రమంలోనే కొన్ని లక్షల మంది కరోనా కాటుకు బలైపోయారు.మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య సైతం రోజురోజుకు అమాంతం పెరిగిపోతున్నాయి.
ఇక ఈ కరోనా పుణ్యమా అని తరచూ శానిటైజర్లు వాడడం, మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పని సరి అయిపోయింది.ముఖ్యంగా బటయ కాలు పెడితే.
మాస్క్ ఉండాల్సిందే.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనాను నివారించడానికి ప్రజలు మాస్కులు వాడక తప్పదని స్పష్టం చేయడమే కాదు.
మాస్క్ ధరించకుండే జరిమానా కూడా విధిస్తున్నారు.దీంతో ప్రతి పనని మాస్క్ ధరించే చేసుకోవడం ప్రజలు అలవాటు చేసుకున్నారు.
అయితే మాస్క్ ధరించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్సర్‌సైజ్ చేయకూడదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.అందులోనూ గుండె సంబంధిత సమస్యలు మరియు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు మాస్క్ ధరించి అస్సలు వర్కౌట్స్ చేయరాదని అంటున్నారు.మాస్క్ పెట్టుకుని వర్కౌట్స్ చేయడం వల్ల.ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బంది పడతారని అంటున్నారు.అదే సమయంలో శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయని.ఒక్కోసారి ఈ సమయంలో గుండె పోటు వచ్చి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.
అలాగే మాస్క్ ధరించి ఎక్సర్‌సైజ్ చేస్తే.ఈ సమయంలో మనం వదిలిన కార్బన్ డయాక్సైడ్ ని మనమే మళ్లీ పీల్చేస్తుంటాం.దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అందువల్ల, మాస్క్ ధరించి వర్కౌట్స్ చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.