సాధారణంగా కొందరి శరీరం ఎంత తెల్లగా, మృదువుగా ఉన్నా పాదాలు నల్లగా ఉంటాయి.పాదాల సంరక్షణ లేకపోవడం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, మురికి, సబ్బుల్లోని ఘాటైన రసాయనాలు, ఎండలు ఇలా రకరకాల కారణాల వల్ల పాదాలు నల్లగా మారి.
అందవిహీనంగా కనిపిస్తాయి.ఈ నేపథ్యంలోనే పాదాలను తెల్లగా మార్చుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.
అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే టమాటాలు.పాదాలను తెల్లగా మెరిపించడంలోనూ గ్రేట్‌గా సహాయపడతాయి.
మరి పాదాలకు టమాటాను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక టమాటాను తీసుకుని రెండు భాగాలు కట్ చేయండి.
ఇప్పుడు ఒక పీస్ తీసుకుని సాల్ట్‌లో ముంచి ఆ తర్వాత పాదాలకు బాగా స్క్రబ్ చేయాలి.ఐదారు నిమిషాల పాటు స్క్రబ్ చేసిన అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా పాదాలను క్లీన్ చేసుకుని తడి లేకుండా టవల్‌తో తడుచుకోవాలి.
అపై మాయిశ్చరైజర్ రాసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే నలుపు వదిలి పాదాలు తెల్లగా మారతాయి.

అలాగే పండిన టమాటాను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి అందులో శెనగపిండి, రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి బాగా రుద్దుకోవాలి.డ్రై అయిన తర్వాత గోరు వెచ్చని నీటితో నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేసినా పాదాలు తెల్లగా మెరుస్తాయి.
ఇక పండిన ఎర్రటి టమాటా తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి దాని నుంచి రసం తియ్యండి.ఇప్పుడు ఆ రసంలో ముల్తానీ మట్టి, నిమ్మకాయ రసం వేసి కలపండి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి.ఆరిన తర్వాత తడి చేతులతో స్క్రబ్ చేసుకుంటూ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే.మంచి ఫలితం ఉంటుంది.