టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ లలో నంబర్ వన్ ఎవరు అంటే… తక్కిన వచ్చే సమాధానం ఎస్ ఎస్ రాజమౌళి అని, ఎందుకంటే తనదైన మ్యాజిక్ తో టాలీవుడ్ సినిమాను విభిన్న రీతిలో ప్రపంచానికి పరిచయం చేశాడు.రాజమౌళి తన కెరీర్ లో ఇప్పటి వరకు డైరెక్ట్ చేసిన 12 సినిమాలు హిట్ అయ్యాయి.
అయితే హిట్ కొట్టడం పెద్ద లెక్క కాదు.ఆ సినిమాలకు ఏదో ఒక విధంగా ప్రత్యేకతను సంతరించుకోవాలి అన్నది రాజమౌళి నిశ్చయం.
రాజమౌళి ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలు అవుతోంది.ఇప్పటి వరకు తాను తీసినవి 12 సినిమాలు మాత్రమే, అయితే బాహుబలి ముందు వరకు కూడా టాలీవుడ్ వరకు మాత్రమే పరిమితం అయ్యాడు రాజమౌళి.
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కించిన బాహుబలి చిత్రాల తర్వాత తన గురించి ప్రపంచానికి తెలిసింది.తన సినిమాలు ప్లాప్ కాకపోవడానికి కారణాలు ఏమిటి అన్న వాటికి సమాధానాలు దొరికాయి.
రాజమౌళి ఎంచుకునే కథలు, వాటిని మలిచే తీరు, పాత్రల ఎంపిక, హీరో ఎలివేషన్ టెక్నిక్, డైలాగ్స్, ఫైట్స్ ఇలా ప్రతి ఒక విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకుని చిన్న కథను అయినా అద్భుతంగా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ కొడతాడు.ఈ మధ్యనే టాలీవుడ్ లో టాప్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో భారీ బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా మూవీని తెరకెక్కించాడు.
ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లలో మంచి కలెక్షన్ లతో దూసుకుపోతోంది.ఈ సినిమాతో మరోసారి రాజమౌళి గురించి సోషల్ మీడియాలో అనేక విషయాలపైన చర్చ జరుగుతోంది.
అందులో ఒకటి తాను సినిమాల్లోకి రాక ముందు బుల్లితెరపై ఒక సీరియల్ ను డైరెక్ట్ చేశాడు.అయితే ఎందుకు సీరియల్ ను డైరెక్ట్ చేయాలనుకున్నాడు.
కానీ సీరియల్ చేయడానికి ముందే సినిమా రంగంలో ఒక డైరెక్షన్ తప్ప మిగిలిన విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది.ముఖ్యంగా లెజెండ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దగ్గర చాలా సినిమాలకు పనిచేశారు.బహుశా ఇతని దగ్గ్గర నుండి జక్కన్న డైరెక్షన్ లోని మెళకువలను నేర్చుకున్నాడు.అయితే రాజమౌళికి ఉన్న ఆసక్తి మరియు దర్హకత్వం పట్ల ఉన్న బాధ్యతను గమనించిన రాఘవేంద్రరావు అప్పట్లో తాను నిర్మించాలి అనుకున్న శాంతినివాసం సీరియల్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని రాజమౌళికి ఇచ్చాడు.
అలా శాంతినివాసం సీరియల్ సంచలనంగా మారింది.ఎందుకంటే ఆ కాలంలో బుల్లితెరపై సీరియల్స్ చాలా తక్కువగా వస్తుండడం మరియు శాంతినివాసం కథ అందరినీ ఆకట్టుకోవడం చేత సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇలా రాజమౌళి పేరు మారుమ్రోగిపోయింది.ఆ విధంగా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో డైరెక్టర్ అయ్యాడు రాజమౌళి.