ఫ్రిజ్‌లో పెట్టని కొబ్బరి నీళ్లు( Coconut Water ) తాగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటన డెన్మార్క్‌లో( Denmark ) జరిగింది.69 ఏళ్ల వ్యక్తి నెల రోజుల పాటు ఫ్రిజ్‌లో( Refrigirator ) పెట్టకుండా వదిలేసిన కొబ్బరి నీళ్లు తాగడంతో దారుణమైన పరిస్థితి ఎదురైంది.చిన్న మొత్తంలో తీసుకున్నా, పాడైపోయిన సహజ ఉత్పత్తులు ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం కళ్లకు కడుతోంది.
“ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్” జర్నల్‌లో ఈ కేసు వివరాలు వెల్లడించారు.పూర్తిగా షేవ్ చేసిన కొబ్బరికాయ నుంచి నేరుగా స్ట్రా ఉపయోగించి ఆ వ్యక్తి కొబ్బరి నీళ్లు తాగాడు.
మొదటి గుక్కలోనే రుచి బాగోలేదని గ్రహించి వెంటనే ఆపేశాడు.అనుమానం వచ్చి కొబ్బరికాయను తెరిచి చూడగా.లోపల జిగురుగా, కుళ్లిపోయి ఉండటం చూసి షాకయ్యాడు.

విచారణలో ఆ కొబ్బరికాయను దాదాపు 27 రోజులుగా వంటగది బల్ల మీద ఫ్రిజ్‌లో పెట్టకుండా వదిలేశారని తేలింది.నిజానికి కొబ్బరి నీళ్లను 4°C నుంచి 5°C ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి.కానీ, అలా చేయకపోవడంతోనే ఈ ఘోరం జరిగింది.
కొబ్బరి నీళ్లు తాగిన కొద్ది గంటల్లోనే ఆ వ్యక్తి పరిస్థితి విషమించింది.వికారం, వాంతులు, విపరీతమైన చెమటలు, అయోమయం, నడవడానికి ఇబ్బంది పడ్డాడు.
వెంటనే ఆసుపత్రికి తరలించారు.MRI స్కానింగ్‌లో మెదడులో తీవ్రమైన వాపు ఉన్నట్లు గుర్తించారు.

శరీరం నుంచి విష పదార్థాలను సరిగ్గా తొలగించలేకపోవడం వల్ల మెదడుపై ప్రభావం చూపే “మెటబాలిక్ ఎన్‌సెఫలోపతి”( Metabolic Encephalopathy ) అనే ప్రమాదకరమైన పరిస్థితిగా వైద్యులు నిర్ధారించారు.డాక్టర్లు ఎంత ప్రయత్నించినా, ఆసుపత్రిలో చేరిన 26 గంటల్లోనే ఆ వ్యక్తి బ్రెయిన్ డెడ్ (మెదడు పనిచేయకపోవడం)గా ప్రకటించబడ్డాడు.
ఆహార భద్రతా నిపుణులు చెబుతున్న ప్రకారం.కొబ్బరికాయను షేవ్ చేసి, తెల్లటి గుజ్జు బయటపడిన తర్వాత అది చాలా త్వరగా పాడైపోతుంది.సింగపూర్‌కు చెందిన ఆహార భద్రతా నిపుణులు డాక్టర్ శామ్యూల్ చౌదరి మాట్లాడుతూ తెరిచిన కొబ్బరికాయలను ఎల్లప్పుడూ గాలి చొరబడని కంటైనర్‌లో ఫ్రిజ్‌లో నిల్వ చేయాలని సూచించారు.ఫ్రిజ్‌లో పెడితే 3-5 రోజులు మాత్రమే సురక్షితంగా ఉంటాయి.
అంతకంటే ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే, ఆరు నెలల వరకు ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చని తెలిపారు.
ఈ కేసు సహజ ఉత్పత్తులైన కొబ్బరి నీళ్లను కూడా సరైన పద్ధతిలో నిల్వ చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది.
పాడైపోయిన ఆహారం ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.కాబట్టి, ఎల్లప్పుడూ జాగ్రత్త వహించడం చాలా అవసరం.