చుండ్రు వచ్చిందంటే ఒక పట్టాన వదలదు.ఎన్ని రకాల యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడిన పెద్దగా ప్రయోజనం ఉండదు.
మార్కెట్ లో దొరికే యాంటీ డాండ్రఫ్ షాంపూలు తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి.కానీ శాశ్వతంగా చుండ్రును తరిమి కొట్టవు.
అందువల్ల సహజ సిద్ధమైన పదార్ధలను ఉపయోగించి చుండ్రును తరిమి కొట్టవచ్చు.వాటిలో రోజ్ మేరీ పౌడర్ చాలా సమర్ధ వంతంగా పనిచేస్తుంది.
రోజ్ మేరీ పౌడర్ లో శక్తి వంతమైన యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన తల మీద చర్మంపై ఉండే డాండ్రఫ్ కారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.అలాగే తల మీద చర్మంపై రక్తప్రసరణను పెంచుతుంది.
అదనంగా ఉత్పత్తి అయ్యే నూనెను కూడా నిరోధిస్తుంది.అయితే చుండ్రు నివారణకు రోజ్ మేరీ పొడిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
ఒక కప్పు నీటిలో రోజ్ మేరీ పొడి వేసి బాగా మరిగించాలి.ఆ నీరు ముదురు గోధుమరంగులోకి వచ్చే దాకా మరిగించాలి.
ఈ మిశ్రమం చల్లారాక వడకట్టి ఒక బౌల్ లో తీసుకోవాలి.
ఈ మిశ్రమంలో లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ను కలపాలి.నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ తల మీద చర్మాన్ని శుభ్రం చేయటానికి సహాయ పడుతుంది.ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరినూనె కలపాలి.
కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది.ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలో జుట్టుకు బాగా పట్టించి మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.
ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.