బయట చికెన్ షాపూలలో దొరికే సాధారణ బ్రాయిలర్ కోడి కన్నా, దేశి కోడి ధర ఎందుకు ఎక్కువ ఉంటుంది ? మనం కొనుక్కొని తినే చికెన్ రుచి కన్నా, ఏదైనా పల్లెటూరికి వెళ్ళినప్పుడు, చుట్టాలు ఇంట్లో కోసే కోడి రుచి ఎందుకు ఆకట్టుకుంటుంది ? ఈ తేడా ఎందుకు ? మతలబు ఏంటి ? అసలు మనం ఎప్పుడు తినే బ్రాయిలర్ చికెన్ మంచిదేనా ? అవి ఎందుకు తక్కువ ధరకి దొరుకుతున్నాయి ? చికెన్ ఇంత ఎక్కువ పరిమాణంలో మార్కెట్లో ఎందుకు దొరుకుతుంది ? మనం ఆరోగ్యకరమైన చికెన్ తింటున్నామా ? ఈ ప్రశ్నలు ఎప్పుడైనా మీ మెదడుని తట్టాయా ? తట్టినా, తట్టకపోయినా, సమాధానాలు మేం చెబుతున్నాం.మనం తినే చికెన్ పూర్తిగా ఆరోగ్యకరం కాదు, రుచిగా ఉంది అంటే మీరు ఇంకా దేశి కోడి రుచి చూడనట్టే.
ఎందుకు పూర్తిగా ఆరోగ్యకరం కాదు అంటే, కొన్ని చేదు కారణాలు ఉన్నాయి, కొన్ని చేదు నిజాలు ఉన్నాయి .ఆ చేదు నిజాలు ఏంటో చూడండి.
1.హార్మోన్ ఇంజెక్షన్లు
* ఇంట్లో పెరిగిన కోడి సహజసిద్ధంగా పెరుగుతుంది.అది త్వరగా పెరగాలని మనం ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వం.దాణా తప్ప ఇంకేమి పెట్టం.కాని బయట దొరికే బ్రాయిలర్ కోడి అలా కాదు.అది పెరిగే వాతావరణం చాలా వేరు.
సమయానికి ఎన్ని కోడిలను సిద్ధం చేస్తే వ్యాపరదారులకి అంత లాభం.అందుకే వాటికి గ్రోత్ హార్మోన్స్ అందిస్తారు.
యాంటిబయోటిక్స్ ఇంజెక్ట్ చేస్తారు.ఇది కొత్తగా మొదలైన ట్రెండ్ కాదు.1980 లలో లేదా అంతకంటే ముందే మొదలైంది.అప్పట్లోనే ఎన్నో దేశాలు జంతువుల మాంసంలో సింథటిక్ హార్మోన్స్ ఇంజెక్ట్ చేయడాన్ని బ్యాన్ చేసాయి.
ఇంతలా వివాదాలు తలెత్తినా, పౌల్ట్రీ వ్యాపారస్తులు గ్రోత్ హార్మోన్స్ ఇవ్వడం మానట్లేదని రిపోర్ట్స్ చెబుతున్నాయి.ఈ ప్రాసెస్ ఎలాంటిది అనే, పచ్చిగా ఉన్న కాయను తీసుకొచ్చి, బలవంతగా పండులా మార్చడం.
దాని వల్ల ఆ పండులో సహజసిద్ధమైన రుచి ఉండదు .అది పక్కన పెడితే ఆ పండుకోసం వాడిన రసాయనాలు మన శరీరంలోకి వెళతాయి.ఇప్పుడు బ్రాయిలర్ కోడి విషయంలో మనకు జరుగుతున్నది అదే, వాటికి అందిస్తున్న హార్మోన్ ఇంజెక్షన్ల ప్రభావం మన శరీరం మీద కూడా పడవచ్చు.
2.ఎముకలు బలహీనం, కృత్రిమంగా పెంచిన మాంసం
* త్వరగా పెరగటానికి ఎలాగైతే గ్రోత్ హార్మోన్స్ వాడుతున్నారో .అలాగే మాంసం ఎక్కువ ఉండటానికి, బరువు ఎక్కువ ఉండటానికి కూడా చాలా రకాల కెమికల్స్ వాడతారు.ఈ ఇంజెక్షన్ల వలన 3% రేట్లు త్వరగా పెరగడం, మాంసం, బరువు కలిగి ఉండటం జరుగుతుందట.అందుకే, వాటి ఎముకలు చాలా వీక్ గా ఉంటాయి.ఈ విషయాన్నీ మీరు కూడా గమనించే ఉంటారు .మనం తినే చికెన్ ఎముకలు ఎంత సులువుగా విరుగుతాయో .అలా ఎందుకు జరుగుతుంది అంటే, అంటే కోడి వయసు తక్కువ కాబట్టి.వాటికి మంచి ఆహారానికి బదులు కెమికల్స్, హార్మోన్ ఇంజేక్షన్స్ అందుతున్నాయి కాబట్టి.
ఇలా చేయడం వలన వాటిలో టాక్సిన్స్ బాగా చేరిపోతాయి.అవే టాక్సిన్స్ మన శరీరంలోకి కూడా చేరతాయి.
దీని వలన ఎన్నో జబ్బులు రావొచ్చు.దేమేన్తియా, నరాల సమస్యలు, చివరకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.
ఈ టైప్ చికెన్ వలన ఒంట్లో కొలెస్టరాల్ లెవెల్స్ కూడా పెరిగిపోవచ్చు.
3.రోగాలకు నిలయం ఈ కోడి
* బ్రాయిలర్ కోడిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉండవచ్చు.అది పెరిగే వాతావరణం దానికి కారణం కావచ్చు.
ఒక కోడికి ఏదైనా సమస్య వస్తే, అది మెల్లిగా ఇతర కోడిలపై కూడా ప్రభావం చూపవచ్చు.అంటే ఇంఫెక్స్ట్ అయిన ఒక కోడి మిగితావాటికి కూడా తన ఇన్ఫెక్షన్ ని అంటించవచ్చు.
ఇదే జరిగితే, వాటికి ఉన్న ఇన్ఫెక్షన్ మీ శరీరంలోకి కూడా వెళ్ళవచ్చు.పౌల్ట్రీ మాంసం వలన వచ్చే ఇంక్ఫెక్షన్స్ తో ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది జబ్బుల బారిన పడుతున్నారు.
ఇది కేవలం మనదేశంలోనే ఉన్న సమస్యే కాదు.అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ కల్తి వ్యాపారం జరుగుతూనే ఉంది.
ఒక కోడికి ఏదైనా జబ్బు వస్తే పట్టించుకునే నాధుడు ఎవరు ? వేల కొద్ది కోడ్లు ఒకే చోట పెరుగుతాయి.ఇక ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా ఎందుకు ప్రయాణం చేయవు ? పరిశోధనల ప్రకారం 65% బ్రాయిలర్ చికేన్లలో ఈకోలి అనీ హానికరమైన బ్యాక్టీరియా ఉంటోందట.ఒక్క అమెరికాలోనే ఈ బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ వలన ఏడాదికి 1,28,000 మంది హాస్పిటల్ బెడ్ ఎక్కుతున్నారట.
4.మంచి లైఫ్ స్టయిల్ లేని కోడి
* పౌల్ట్రీ చికెన్ స్వచ్చమైన గాలి పీల్చుకోదు, స్వేచ్చగా బయటతిరగదు, నడిచే వీలు ఉండదు .బంధిలాగా పడి ఉంటుంది.ప్రకృతి చూడని జీవితం, ఎలాంటి వ్యాయామం లేని శరీరం దానిది.ఒక మనిషి బయటి గాలి పీల్చుకోకుండా, ఎప్పుడు ఒకే గదిలో కూర్చొని, శరీరానికి తినటం తప్పిస్తే, ఎలాంటి పని లేక ఉంటే ఎంత అనారోగ్యంగా ఉంటాడో, ఒక బ్రాయిలర్ కోడి కూడా అంతే అనారోగ్యంగా ఉంటుంది.
అందుకే దానికి రోగనిరోధకశక్తి తక్కువ.యాంటి బయోటిక్స్ ఇస్తూ పోతారు.అందుకే వాటిని సాల్మొనెల్ల అనే మరోరకం బ్యాక్టీరియా ఉంటుంది.అవి తినే మనిషిలో కూడా ఈ కారణంతోనే రోగనిరోధకశక్తి తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఇదే కారణంతో ఫుడ్ పాయిజనింగ్ కూడా జరుగుతుంది.అవియన్ ఫ్లూ అని జబ్బు వచ్చే ప్రమాదం లేకపోలేదు.
5.గాలి కలుషితం
* ఇక మనిషి శరీరాన్ని కాసేపు పక్కన పెట్టి, మన వాతావరణం గురించి ఆలోచిస్తే, కోడిలను పెంచుతున్న ప్రదేశం దగ్గరి వాతావరణం బాగా కలుషితం అవుతోంది.వాటికి ఎన్నో రకాల కెమికల్ ఆహార పదార్థాలు ఇస్తారు, హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు, బయటి గాలి లేక, అనారోగ్యమైన టెంపరేచర్ లో పెరుగుతాయి అవి, దీంతో అవి వదిలే మలమలీనాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.ఆ టాక్సిన్స్ గాలిలో కలిసిపోతున్నాయి.
పౌల్ట్రీ దరిదాపుల్లో బ్రతుకుతున్న మనుషులు గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.ఈరకంగా కూడా మనిషి నష్టపోతున్నాడు.
ఇక్కడ కేవలం మనిషే కాదు, గాలి, వాతావరణం, అన్య ప్రాణులు కూడా ఈ కలుషితమైన గాలి పీల్చుకొని నష్టపోతున్నాయి.