ఇటీవల కాలంలో సినిమాలకు సీక్వెల్స్ అన్నది కామన్ అయిపోయింది.ఎక్కువ శాతం సినిమాలు రెండు మూడు పార్ట్ లుగా విడుదల అవుతున్నాయి.
సినిమా హిట్ అయితే ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆ సినిమాలకు సీక్వెల్స్ ని ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.అయితే ఈ విషయంలో హాలీవుడ్ ఇండస్ట్రీ ముందు ఉంటుంది అని చెప్పాలి.
ఇప్పటికే లెక్కలేనన్ని సినిమాలు భాగాలుగా వచ్చిన విషయం తెలిసిందే.సాధారణంగా సీక్వెల్ ఏదైనా మొదటి భాగానికి కొనసాగింపుగా రెండో భాగం ఉంటుంది.
అలా కాకుండా వచ్చిన సినిమాలోని కథకు అంతకుముందు ఏం జరిగింది అనేది చూపించడం ఒక కొత్త ప్రక్రియ అని చెప్పవచ్చు.ఇటీవలే ఇలాంటి సినిమాలు వస్తున్నాయి.
కాగా 2022 లో రిషబ్ శెట్టి( Rishab Shetty ) హీరోగా నటించి, దర్శకత్వం వహించిన కాంతార సినిమా( Kantara ) సంచలన విజయం సాధించింది.16 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా దాదాపుగా 400 కోట్లకి పైగా వసూలు సాధించి కొత్త రికార్డు సృష్టించింది.అయితే ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1( Kantara Chapter 1 ) చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాపై వున్న భారీ అంచనాల్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి 200 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు మూవీ మేకర్స్.
కాంతార వెనుక చాలా చరిత్ర ఉందని, ఛాప్టర్ 1లో దాన్ని విస్తృత స్థాయిలో తెరకెక్కించబోతున్నట్టు దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

అయితే ఇప్పటివరకు రూపొందిన ప్రీక్వెల్స్ ని పరిశీలిస్తే మొదట రిలీజ్ అయిన సినిమాలే ఘన విజయాలు అందుకున్నాయి తప్ప ఆ తర్వాత ప్రీక్వెల్ పేరుతో విడుదలైన సినిమాలు కొన్ని ఫ్లాప్ అవ్వగా, మరికొన్ని ఆశించిన స్థాయి విజయాలను అందుకోలేకపోయాయి.బిల్లా చిత్రానికి ప్రీక్వెల్‌గా వచ్చిన డేవిడ్ బిల్లా( David Billa ) బాక్సాఫీస్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది.హాలీవుడ్ లో ఈ తరహా ప్రయోగాలు అనేకం జరిగి ఉంటాయి.కానీ ఇండియాలో రిలీజ్ అయిన ది లయన్ కింగ్ సినిమా పరిస్థితి కూడా అదే.1994లో యానిమేషన్ లో వచ్చిన ఈ సినిమా 45 మిలియన్ డాలర్లతో నిర్మిస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది.1998 లో ది లయన్ కింగ్ 2గా( The Lion King 2 ) ప్రీక్వెల్ ను నిర్మించారు.కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

2019లో 3డి యానిమేషన్‌లో వచ్చిన ది లయన్‌కింగ్ చిత్రాన్ని 260 మిలియన్ డాలర్లతో నిర్మించగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలై 1650 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.2024లో దీనికి ప్రీక్వెల్ గా వచ్చిన ముఫాసా ది లయన్ కింగ్ 300 మిలియన్ డాలర్లతో నిర్మిస్తే కేవలం 700 మిలియన్ డాలర్లు మాత్రమే కలెక్ట్ చేసింది.ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రీక్వెల్స్‌ని పరిశీలిస్తే ఏ ఒక్కటి కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు.ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కాంతార ఛాప్టర్ 1పై డిస్కషన్ జరుగుతోంది.
ఈ సినిమాకి ఎలాంటి ఫలితం వస్తుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు.ఇప్పటి వరకు ప్రీక్వెల్స్ హిట్ అవ్వలేదు అనే సెంటిమెంట్ ని బ్రేక్ చేసేందుకు హోంబలె ఫిలింస్ అధినేతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా కాంతార ఛాప్టర్1ను తెరకెక్కిస్తున్నారు.
మరి ఆ సెంటిమెంట్లు అన్ని బ్రేక్ చేసి కాంతారావు చాప్టర్ వన్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలని మరి.