అటుకులు. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
అటుకులతో ముఖ్యంగా పులిహోర( Pulihora ) తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటారు.అటుకుల పులిహోరను పోహ( Poha ) అని కూడా పిలుస్తుంటారు.
చాలా మందికి ఫేవరెట్ ఫుడ్స్ లో అటుకుల పులిహోర ఒకటి.అయితే ఆకలి తీర్చడానికి మాత్రమే అటుకుల పులిహోర సహాయపడుతుందని తీసి పారేస్తే పొరపాటే అవుతుంది.
నిజానికి ఆరోగ్యపరంగా కూడా అటుకుల పులిహోర వల్ల అనేక లాభాలు ఉన్నాయి.ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో దీన్ని తింటే ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

అటుకుల పులిహోర చాలా త్వరగా డైజెస్ట్ అవుతుంది.జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.మలబద్ధకం( Constipation ) సమస్యను దూరం చేస్తుంది.అలాగే అటుకుల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి.షుగర్స్ ఫ్యాట్స్ కూడా మితంగానే ఉంటాయి.కానీ ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ మాత్రం మెండుగా ఉంటాయి.
అటుకుల పులిహోర ను తినడం వల్ల మెటబాలిజం రేటు( Metabolism Rate ) ఇంప్రూవ్ అవుతుంది.ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.
వెయిట్ లాస్ కు ( Weight Loss ) సహాయపడుతుంది.అందువల్ల బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి అటుకుల పులిహోర పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ గా చెప్పుకోవచ్చు.

అలాగే అటుకుల పులిహోరలో లెమన్ ను( Lemon ) వాడటం వల్ల విటమిన్ సి లభిస్తుంది.ఇది మన రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.అటుకుల పులిహోర ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అందులో ఉండే డైటరీ ఫైబర్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.మరియు ప్రోటీన్ శరీరాన్ని ఎక్కువ సమయం పాటు ఎనర్జిటిక్ గా ఉండేలా చేస్తుంది.
నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.కాబట్టి అటుకుల పులిహోరను అస్సలు తీసి పారేయకండి.
మీ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీస్ లో దీన్ని కూడా చేర్చండి.