ప్రకాశం జిల్లా ఒంగోలులోని గాంధీరోడ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.స్థానికంగా ఉన్న కాయర్ రోఫ్ మర్చంట్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.ముందుగా గోడౌన్ లో చెలరేగిన మంటలు మూడు ఫ్లోర్లకు వ్యాపించాయి.
దీంతో లోపల ఉన్న నవ్వార్లు, తాళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.