1.ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు నిందితులకు బెయిల్
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
2.సిబిఐ కార్యాలయానికి వివేకా కుమార్తె
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి గురువారం ఉదయం సిబిఐ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.
3.కెసిఆర్ ఫుల్ బాటిల్ ఎత్తుతుండు : బండి
బిజెపి పెట్టే టెన్షన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫుల్ బాటిల్ ఎత్తుతుండు అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
4.సిబిఐ విచారణకు మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్ర
సిబిఐ విచారణకు ఢిల్లీలోని తెలంగాణ భవనం నుంచి నేరుగా మంత్రి గంగుల కమలాకర్ సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు.అలాగే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా మంత్రితో పాటు ఉన్నారు.
5.వైసిపి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు
వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు అన్నారు.
6.5 న బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో డిసెంబర్ 5న ఆల్ఫ పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
7.జనవరి 8న సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష
ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 8 న నిర్వహిస్తున్నట్లు కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్ అరుణ్ కులకర్ణి తెలిపారు.
8.ఏపీ మంత్రి భార్యకు ఐటీ నోటీసులు
ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకమ్మకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.బినామీ యాక్ట్ కింద నోటీసులు జారీ అయ్యాయి.
9.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది శ్రీవారి దర్శనం కోసం మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
10.మహబూబాబాద్ జిల్లాకు దాశరధి పేరు పెట్టండి
మహబూబాబాద్ జిల్లాకు దాశరధి కృష్ణమాచార్య పేరు పెట్టాలని ఆయన కుమారుడు దాశరధి లక్ష్మణ్ తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ కు విజ్ఞప్తి చేశారు.
11.పోలవరంపై ఎత్తిపోతలను అడ్డుకోండి
టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించిన నిర్ణయానికి విరుద్ధంగా ఎత్తిపోతలను ఏపీ చేపట్టిందని , దానిని వెంటనే అడ్డుకోవాలని జి ఆర్ ఎం బి చైర్మన్ ముఖేష్ కుమార్ సింహ కు తెలంగాణ ఈ ఎం సి సి మురళీధర్ లేఖ రాశారు.
12.ఆయుర్వేద కాలేజీల్లో అడ్మిషన్లకు అంగీకారం
తెలంగాణలో ఉన్న రెండు ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీలో ప్రవేశాలకు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.
13.3న పాస్పోర్ట్ ప్రత్యేక డ్రైవ్
పాస్పోర్ట్ జారీ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో వచ్చే శనివారం పాస్పోర్ట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు.
13.జేఎన్టీయూలో ఆన్లైన్ కోర్సులు
జేఎన్టీయూహెచ్ స్కూల్ ఆఫ్ కంటిన్యూయింగ్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 6 మాసాలకు సంబంధించిన ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ పిఆర్ఓ ఉషాజీ నకరి తెలిపారు.
14.త్వరలో ఐటీ ఉద్యోగులకు టిఎస్ఆర్టిసి ప్రత్యేక బస్సులు
హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగుల కోసం టిఎస్ఆర్టిసి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించుకుంది.
15.వైసీపీలోకి రావాలని బెదిరిస్తున్నారు : జనసేన నేత
తనను వైసీపీలోకి రావలసిందిగా బెదిరిస్తున్నారని తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్ రాయల్ అన్నారు.
16. జడ్జిల బదిలీలను ఆపాలి
హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్ జస్టిస్ డి రమేష్ ల బదిలీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ హైకోర్టు వద్ద న్యాయవాదులు నిరసన చేపట్టారు.
17.ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ కు కోటి విరాళం
హైదరాబాద్ కు చెందిన పివి రెడ్డి ట్రస్ట్ చైర్మన్ పన్నాల పర్వతాల రెడ్డి , వంశీధర్ రెడ్డిలు టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్సీ ప్రాణదానం ట్రస్టుకు కోటి విరాళంగా అందించారు.
18.కవితపై ఎంపి అరవింద్ ట్వీట్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు రావడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు.” అయ్యయ్యో ఇప్పుడు ఎలక్షన్ లో నా మీద ఎవరు వెంటాడి వేటాడి నిలవడతారు ?” అంటూ ట్వీట్ చేశారు.
19.షర్మిలపై ప్రభుత్వ విప్ కామెంట్స్
” మీ కుటుంబం గొడవలు ఉంటే అక్కడే తేల్చుకో ” అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలపై తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ విమర్శలు చేశారు.
20.ఎమ్మెల్సీ కవితకు ఈటెల రాజేందర్ కౌంటర్
తెలంగాణ చాలా తన్నట్లు దోచుకోవడానికి ఢిల్లీ పై పడ్డారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు.