తెలుగు టెలివిజన్ రంగంలో స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుమ కనకాల ( Suma Kanakala )ఒకరు.గత కొన్ని దశాబ్దాలుగా టెలివిజన్ రంగంలో యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఎంతోమంది కొత్తవారు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ కూడా సుమ ముందు వారందరూ తేలిపోతూ ఇప్పటికీ సుమ స్టార్ యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక సుమ నాలుగు పదుల వయసు పూర్తి చేసుకున్నప్పటికీ అదే ఉత్సాహంతో అదే చురుకుతనంతో యాంకరింగ్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు.
ఇక సినిమా ఏదైనా సినిమా విడుదల అవుతుంది అంటే ఆ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం నుంచి మొదలుకొని సక్సెస్ మీట్ కార్యక్రమాల వరకు సుమా చేతుల మీద గానే నడుస్తుంది.అంత క్రేజీ యాంకర్ గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన సుమ వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ కూడా వచ్చారు.గతంలో పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించిన ఈమె జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో సుమ నటనకు మంచి మార్కులు పడినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో ఎంతో బిజీ యాంకర్ గా మారిపోయిన సుమ ఒక కార్యక్రమానికి హోస్టగా వ్యవహరిస్తే లక్షల్లోనే రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ యూట్యూబర్ సుమ గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.ఒక గంట కోసం సుమ తీసుకొని ఇదే అంటూ అసలు విషయాన్ని వెల్లడించారు.యూట్యూబ్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నిఖిల్ ( Nikhil )సుమతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక సుమ లంచ్ ( Lunch ) కోసం తెచ్చుకున్న లంచ్ బాక్స్ చూసి నిఖిల్ షాకయ్యాడు.బాక్స్ ఓపెన్ చేసి ఒక్కో ఐటెంను టేస్ట్ చేస్తూ గంట షో కోసం సుమ గారు ఇంత పెద్ద క్యారియర్ తెచ్చుకున్నారంటూ సెటైర్లు వేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.