రోజుని నీళ్ళు తాగి మొదలుపెట్టాలని అంటారు.ఎందుకంటే 7-8 గంటలు నీరు లేక బాడి డిహైడ్రైట్ అయిపోతుంది.
అందుకే లెవగానే నీళ్ళు తాగాలి.అలాగే రాత్రి పడుకునే ముంది గ్రీన్ టీ తాగితే, ఎన్నో లాభాలున్నాయి.
వాటిలో కొన్ని చదివి తెలుసుకోండి.
* మెటబాలిజం సరిగా ఉంటే సుఖమైన నిద్ర పడుతుందని ఎన్నో పరిశోధనలు తేల్చి చెప్పాయి.
మెటబాలిజం బాగా ఉండాలంటే గ్రీన్ టీ అవసరం ఎంతగానో ఉంది.
* యాంటిఆక్సిడెంట్స్ లో అతి ప్రభావంతమైన యాంటిఆక్సిడెంట్ కాటేచిన్.
ఇది గ్రీన్ టీలో దండిగా దొరుకుతుంది.శరీరంలోని అంతర్గత సమస్యలతో పోరాడడానికి కాటేచిన్ ఉపయోగపడుతుంది.
* జలుబుతో ఇబ్బందిపడినా, జ్వరం కలవరపెట్టినా, గ్రీన్ టీ తాగి పడుకోండి.తప్పకుండా ప్రభావం చూపుతుంది.
* ఇది వర్షాకాలం.వాతావరణంలో జరిగే చిన్ని చిన్ని మార్పులు కూడా వైరల్ ఇంఫెక్షన్స్ కి కారణమవుతాయి.
మరీ ముఖ్యంగా జ్వరం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.గ్రీన్ టీలో లభించే పోలిఫెనల్స్ ఇలాంటి వైరల్ ఇంఫెక్షన్స్ ని అడ్డుకుంటాయి.
ఈ సీజన్ లో గ్రీన్ తాగడం తప్పకుండా అలవాటు చేసుకోండి.
* గ్రీన్ టీ చాలా శక్రివంతమైనది.
రాడికల్స్ ఎదగకుండా అడ్డుకోని రొమ్ము క్యాన్సర్, కొలోన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలోటెరాల్ క్యాన్సర్ ని అడ్డుకుంటుంది గ్రీన్ టీ.
* రాత్రి పడుకునే ముంది గ్రీన్ టీ తాగే అలవాటు ఉన్నవారి మెదడు చురుకుగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
* రకరకాల రోగాలకి మూలం శరీరంలో ఉండే టాక్సీన్స్.వీటితో పోరాడలంటే గ్రీన్ టీ తాగడం సులువైన మార్గం.ఈ పని ఆపిల్ సైడ్ వెనిగర్ కూడా చేస్తుంది కాని ఖర్చుతో పాటు, రుచిని కూడా చూసుకుంటే, గ్రీన్ టీ వైపు చూడటం మంచిది.