ఎప్పుడు జాలీగా ఉండే ప్రభాస్ ఇటీవల విషాదంలో మునిగిపోయాడు.ప్రభాస్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించి ఎంతో ప్రేమ అభిమానులను చూపించిన ప్రభాస్ పెదనాన్న టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవలే అనారోగ్యం కారణంగా మరణించాడు.
దీంతో ప్రభాస్ చిన్నపిల్లాడిలా ఏడ్చేసాడు అనే విషయం తెలిసిందే.పెదనాన్న పోయిన బాధల నుంచి ప్రభాస్ ఇంకా తేరుకోలేకపోతున్నాడు.
ఎక్కడికి వెళ్లినా కూడా ఇంకా ఆయన జ్ఞాపకాలలోనే ఉంటున్నాడు అని చెప్పాలి.
ఇకపోతే ఇప్పుడు వరకు ప్రభాస్ తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న నేటితరం యువ హీరోలలో ఎవరు ఇప్పటివరకు తండ్రులను కోల్పోయారు అన్న విషయం సోషల్ మీడియా వెతికిగా హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ : ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలు స్టార్ హీరో లుగా కొనసాగుతున్న ఈ నందమూరి హీరోల తండ్రి నందమూరి హరికృష్ణ ను కోల్పోయారు.కాదా నందమూరి హరికృష్ణ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఆయన యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు అన్న విషయం తెలిసిందే.నందమూరి హరికృష్ణ దూరమైన తర్వాత ఈ ఇద్దరు కూడా ఒకరంటే ఒకరికి ప్రాణంగా బ్రతుకుతూ ఉన్నారు అని చెప్పాలి.ఇప్పటికి తండ్రి గురించి ఎప్పుడు తలుచుకున్న వీరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉంటాయి.
సంతోష్ శోభన్ : తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సంతోష్ శోభన్ తండ్రిని కోల్పోయారు.తండ్రి లేకపోవడంతో ఇక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు సంతోష్ శోభన్.ఇతని తండ్రి ఒకప్పుడు దర్శకుడిగా పని చేసి కొంతమంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు కూడా.
ప్రభాస్ నటించిన వర్షం సినిమాకు కూడా సంతోష్ శోభన్ తండ్రి దర్శకుడు.
నిఖిల్ : యువ హీరోలు అందరిలో కూడా తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది అన్న విషయాన్ని తన సినిమాలతోనే నిరూపించుకుంటున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. తనకు ఎంతో ఇష్టమైన తండ్రిని కోల్పోయాడు అని చెప్పాలి.కాగా నిఖిల్ తండ్రి అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు.
సుశాంత్ : అక్కినేని అనే భారీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితమైన హీరో సుశాంత్.మంచి టాలెంట్ గా ఉన్నప్పుడుకి ఎందుకో ఇండస్ట్రీలో మాత్రం అతనికి కలిసి రాలేదు అని చెప్పాలి.సుశాంత్ కూడా తన తండ్రిని కోల్పోయాడు.ఇక ఎన్నోసార్లు తన తండ్రిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతూ ఉంటారు.
ఇలా సీనియర్ హీరోలలో ఎంతో మంది తండ్రిని కోల్పోయిన వారు ఉన్నప్పటికీ నేటి తరం హీరోలలో మాత్రం ఈ కొంతమంది హీరోలు మాత్రమే తండ్రిని కోల్పోయి విషాదంలో మునిగిపోయారు.