తెల్ల జుట్టు( white hair ) అనేది వృద్ధాప్యానికి సంకేతం.అందువల్ల తలలో తెల్ల వెంట్రుకలు కనపడగానే తెగ హైరానా పడిపోతుంటారు.
తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు ఆర్టిఫిషియల్ కలర్స్ పై ఆధార పడుతుంటారు.కానీ సహజంగా కూడా తెల్ల జుట్టు సమస్యను దూరం చేసుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెమెడీతో తెల్ల జుట్టుకు బై బై చెప్పవచ్చు.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో చేతినిండా ఉల్లి తొక్కలు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు( fenugreek ), వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, చేతినిండా ఎండిన కరివేపాకు( curry leaves ) వేసి నల్లగా మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి.ఇలా ఫ్రై చేసుకున్న పదార్థాలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పొడిలో రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్,( henna powder ) రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )మరియు సరిపడా రోజ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.పది రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
ఈ రెమెడీ తెల్ల వెంట్రుకలను క్రమంగా నల్లగా మారుస్తుంది.వైట్ హెయిర్ ప్రాబ్లం ను సహజంగానే దూరం చేస్తుంది.

పైగా ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకపోవడం వల్ల ఈ రెమెడీతో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు.అంతే కాకుండా ఈ రెమెడీని పాటిస్తే జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.హెయిర్ ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.తెల్ల జుట్టు రాని వారు కూడా ఈ రెమెడీని ట్రై చేయవచ్చు.తద్వారా జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది.ఫలితంగా ఏజ్ పెరిగిన కూడా వైట్ హెయిర్ కు దూరంగా ఉండవచ్చు.