టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోయిన్లలో శ్రీలీల( Srilila ) ఒకరు కాగా శ్రీలీల రెమ్యునరేషన్ 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.శ్రీలీల చేతిలో ప్రస్తుతం వరుస ఆఫర్లు ఉన్నాయని తెలుస్తోంది.
మాస్ జాతర సినిమాతో ఒక తమిళ సినిమాతో, అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాతో శ్రీలీల బిజీగా ఉన్నారు.
అయితే ఒకే సమయంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆమెకు డేట్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమె వల్ల షూటింగ్స్ వాయిదా పడుతున్నాయని తెలుస్తోంది.
శ్రీలీల స్టడీస్ పరంగా బిజీగా ఉండటం కూడా ఆమె సినిమాల డేట్స్ ఇబ్బందులకు కారణమని తెలుస్తోంది.

శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.శ్రీలీల డేట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తే మంచిది. 2024 సంవత్సరం ఈ బ్యూటీకి కెరీర్ పరంగా కలిసొచ్చిందనే సంగతి తెలిసిందే.
గతేడాది గుంటూరు కారం, పుష్ప ది రూల్ ( Guntur Karam, Pushpa The Rule )సినిమాలు శ్రీలీలకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

మరికొన్ని వారాల్లో శ్రీలీల రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.మార్చి నెల 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.శ్రీలీల త్వరలో మరికొన్ని ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని భోగట్టా.టైర్1 హీరోలకు జోడీగా ఛాన్స్ వస్తే శ్రీలీల కెరీర్ మరింత వేగంగా పుంజుకునే ఛాన్స్ అయితే ఉంది.శ్రీలీలకు సోషల్ మీడియాలో మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో క్రేజ్ ఉంది.శ్రీలీల కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండగా ఎక్కువ ప్రాజెక్ట్స్ కు ఆమె ఓకే చెబుతున్నారు.