డైరెక్టర్ చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య (Nagachaitanya) సాయి పల్లవి(Sai Pallavi) హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం తండేల్.ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్తు నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ లభించింది.

ఇక ఈ సినిమా విడుదలకు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.ఈ క్రమంలోనే ఇటీవల ముంబైలో హిందీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా దేవి శ్రీ పసాద్(Devi Sri Prasad) మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మా ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Amir Khan)సర్ సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయనను కలవడం గర్వంగా కూడా ఉంది.ఇండియన్ సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ ఎంతగానో ఉంది.నిజానికి ముంబై ఆడియన్స్ నా పాటలకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు.
వి లవ్ యు అమీర్ సార్ అంటూ చెప్పుకు వచ్చారు.అదేవిధంగా సినిమా గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు.
ముందుగా డైరెక్టర్ చందు మొండేటి నాకు ఈ సినిమా కథ చెప్పినప్పుడు వెంటనే మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన కడల్ సినిమా గుర్తుకు వచ్చింది అంటూ దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ కథ ఆధారంగా ఈ సినిమా చేశారా అని అందరూ భావిస్తున్నారు కానీ ఈ సినిమా శ్రీకాకుళంలో ఒక జాలరి నిజజీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి మనకు తెలిసిందే