జార్జియా రాష్ట్రంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.లుక్రెషియా కోర్మాస్సా కోయియాన్(Lucrezia Cormassa Coian) అనే 19 ఏళ్ల యువతి, దివ్యాంగులైన రోగులతో దారుణంగా ప్రవర్తించింది.
ఆమె వారిని దుర్వినియోగం చేస్తూ టిక్ టాక్ (TikTok)వీడియోలు తీయడంతో ఈ విషయం బయటపడింది.ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు.
జనవరి 23న పోలీసులకు ఈ వీడియోల గురించి సమాచారం అందింది.వెంటనే రంగంలోకి దిగిన లాగన్‌విల్లే పోలీసులు(Laganville Police) దర్యాప్తు చేపట్టారు.జనవరి 28న లుక్రెషియా (Lucrezia)ఇంటిపై దాడి చేసి ఆమెను అరెస్ట్ చేశారు.వాల్టన్ కౌంటీ జైలుకు తరలించినా, 7,500 డాలర్ల బాండ్ చెల్లించి ఆమె విడుదల అయింది.
వైరల్ అయిన వీడియోల్లో లుక్రెషియా హెల్త్ కేర్ వర్కర్ల దుస్తులైన స్క్రబ్స్, స్టెతస్కోప్(Lucrezia healthcare workers’ uniforms, scrubs, stethoscope) ధరించి ఉంది.ఒక వీడియోలో ఆమె దివ్యాంగుడైన రోగి కూర్చుని ఉండగా, అతడి పక్కనే నిలబడి అద్దంలో చూసుకుంటూ అసభ్యకరంగా డ్యాన్స్ చేసింది.
ఈ ఘటన లాగన్‌విల్లేలోని రోగి ఇంట్లోనే జరిగింది.
మరో షాకింగ్ వీడియోలో, లుక్రెషియా తన స్క్రబ్స్ జేబులో నుండి ఏదో తీసి బలవంతంగా ఒక రోగికి తినిపించింది.చొక్కా లేకుండా బాత్‌టబ్‌లో పడుకున్న మరో రోగి పక్కన నిలబడి డ్యాన్స్ చేస్తూ కనిపించింది.ఆ రోగి చాలా అసౌకర్యంగా ఉన్నట్లు వీడియోలో స్పష్టంగా కనబడుతోంది.
పోలీసులు లుక్రెషియాపై దివ్యాంగులైన రోగులను దుర్వినియోగం చేసినందుకు తీవ్రమైన నేరారోపణలు మోపారు.లాగన్‌విల్లే పోలీస్ చీఫ్ ఎమ్.డి.లౌరీ ఈ వీడియోలను “దిగ్భ్రాంతికరమైన, అసహ్యకరమైనవి”గా అభివర్ణించారు.తమను తాము రక్షించుకోలేని వారిని కాపాడటం పోలీసుల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
రెండవ వీడియోపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఇది ఎక్కడ చిత్రీకరించారో నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు.ఇది లాగన్‌విల్లేలో చిత్రీకరించారా లేదా అనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఇతర ప్రాంతాల పోలీసులతో కూడా కలిసి పనిచేస్తున్నామని చీఫ్ లౌరీ తెలిపారు.
ఈ కేసుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.