ఇటీవల కాలంలో అధిక పొట్టతో ( Belly fat )బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది.పొట్ట పెరగడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి.
శరీరానికి శ్రమ లేకపోవడం, మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి అంశాలు బాన పొట్టకు దారితీస్తాయి.దాంతో అద్దంలో తమను తాము చూసుకుంటూ లోలోన చాలా మదన పడుతుంటారు.
కానీ పొట్ట పెరగడానికే కాదు తగ్గడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఐదు అలవాటు చేసుకుంటే అధిక పొట్టకు సులభంగా గుడ్ బై చెప్పవచ్చు.

మొదట డైట్ లో హెల్తీ ఫుడ్ ను చేర్చుకోండి.కార్బోహైడ్రేట్స్, కేలరీలు తక్కువగా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ,ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోండి.వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ ని ఎంచుకోండి.ఓట్స్, కొర్రలు, జొన్నలు, రాగులు, పెసలు, కందులు, వంటి ఆహారాలను తీసుకోండి.తాజా కూరగాయలు, సీజనల్ పండ్లను డైట్ లో చేర్చుకోండి.బయట ఆహారాలకు వీలైనంతవరకు దూరంగా ఉండండి.
అలాగే వ్యాయామం( Exercise ) మన శరీరానికి ఎంతో అవసరం.పొట్ట తగ్గడానికే కాదు అనేక జబ్బులకు అడ్డుకట్ట వేయాలన్న నిత్యం వ్యాయామం చేయాలి.
రోజుకు అరగంట పాటు ఏదో ఒక వ్యాయామం చేస్తే పొట్ట దెబ్బకు కరిగిపోద్ది.

అధిక పొట్ట తో బాధపడుతున్న వారు పగటి నిద్రకు దూరంగా ఉండండి.చాలామందికి మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నిద్రపోయే అలవాటు ఉంటుంది.కానీ ఇలా అస్సలు చేయకండి.
భోజనం చేసిన వెంటనే పడుకుంటే పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోతుంది.కాబట్టి తిన్న వెంటనే అస్సలు పడుకోవద్దు.
హెర్బల్ టీలు పొట్ట కొవ్వును కరిగించడానికి అద్భుతంగా తోడ్పడతాయి.కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక హెర్బల్ టీ( Herbal tea )ను తీసుకోవడం అలవాటు చేసుకోండి.
గ్రీన్ టీ, మెంతి టీ, పుదీనా టీ.ఇలా ఏదో ఒక హెర్బల్ టీను రోజు తాగితే అధిక పొట్ట దూరం అవుతుంది.ఇక భోజనం చేయడానికి అరగంట ముందు కచ్చితంగా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి.ఇలా చేయడం వల్ల ఆకలి తగ్గుతుంది.ఆకలి తగ్గితే తక్కువగా తింటారు.తక్కువగా తింటే పొట్ట కూడా తగ్గుతుంది.







