తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది.ప్రస్తుతం అఖిల్( Akhil ) ఒక భారీ సినిమాను చేసి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఎందుకంటే ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలేవి ఆయనకు సరైన సక్సెస్ ని సాధించి పెట్టలేదు.కాబట్టి ఈ సినిమాతో భారీ విజయాలను అందుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఒకవేళ ఈ సినిమాలతో కనుక సూపర్ సక్సెస్ లను అందుకోకపోతే ఆయన కెరీర్ అనేది చాలావరకు డౌన్ అయిపోయే అవకాశం కూడా ఉంది.

ఇక ఇప్పటివరకు ఆయన ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఒక్క సక్సెస్ కూడా సాధించకపోవడంతో ఆయన కెరీర్ ఎటువైపు వెళుతుంది అనే ధోరణిలో నాగార్జున( Nagarjuna ) ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.తన తోటి హీరోలందరూ వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్న నేపధ్యంలో తను మాత్రం ఒక సక్సెస్ ని కూడా సాధించలేకపోవడం నిజంగా చాలా బ్యాడ్ లక్ అనే చెప్పాలి.మరి ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలతో ఎలాంటి విజయాలు సాధిస్తాడు.
ఆయన మార్కెట్ ఎంతవరకు పెంచుకోగలుగుతాడనేది తెలియాల్సి ఉంది.

గతంలో వచ్చిన ఏజెంట్ సినిమాతో( Agent Movie ) సూపర్ సక్సెస్ ని సాధిస్తాడని అందరూ అనుకున్నప్పటికి ఆ సినిమా డిజాస్టర్ అయింది.మరి ఇప్పుడు ఆయన మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని మెప్పిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.నిజానికి నాగార్జున లాంటి స్టార్ హీరో తన లెగసిని కంటిన్యూ చేయడానికి అఖిల్ ని హీరోగా దింపాడు.
కానీ ఆయన మాత్రం సక్సెస్ ని కూడా సాధించలేకపోతున్నాడు.ఇక అఖిల్ తో పోల్చుకుంటే నాగచైతన్య( Naga Chaitanya ) కొంతవరకు బెటర్ అనే చెప్పాలి.అడపాదడపా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు…మరో ఇక మీదట చేసే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…