మనకెంతో నచ్చినా ఈ క్రికెట‌ర్లు సినిమాల్లో కూడా నటించారు

క్రికెట్ కు సినిమాకు విడదీయలేని బంధం ఉంది.చాలా మంది క్రికెటర్లు సినీ తారలను పెళ్లి చేసుకున్నారు.

 Indian Cricketers Who Acted In Movies Also , Indian Cricketers, Acted In Movies,-TeluguStop.com

మరికొంత మంది క్రికెటర్లు సినిమాల్లో నటించారు.క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కొందరు సినిమాల్లోకి అడుగు పెడితే.

మరికొంత మంది క్రికెట్ లో కొనసాగుతూనే సినిమాల్లో నటించారు.ఇంతకీ వెండి తెర మీద దర్శనం ఇచ్చిన ఆ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

యువరాజ్ సింగ్
క్రికెటర్ గా ఎన్నో విజయాలు సాధించిన యువరాజ్.సినిమాల్లో మాత్రం సక్సెస్ కాలేదు.తన 11 వ ఏట ఓ పంజాబీ సినిమాలో నటించాడు.ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.

బ్రెట్ లీ

Telugu Anil Kumble, Brett Lee, Irfan Pathan, Kapil Dev, Sunil Gavaskar, Vinod Ka

ఆస్ట్రేలియన్ మాజీ బౌలర్ బ్రెట్ లీ బాలీవుడ్ సినిమాలో నటించాడు.2015లో వచ్చిన అన్ ఇండియన్ చిత్రంలో చేసినా.డిజాస్టర్ మూవీగా మిగిలింది.

అనిల్ కుంబ్లే

Telugu Anil Kumble, Brett Lee, Irfan Pathan, Kapil Dev, Sunil Gavaskar, Vinod Ka

బౌలర్ గా, కెప్టెన్ గా, కోచ్ గా టీమిండియకు ఎన్నో సేవలు అందించిన అనిల్ కుంబ్లే సినిమాల్లో నటించాడు.2008 లో మీరాబాయ్ నాట్ ఔట్ మూవీలో న‌టించాడు.ఈ సినిమా అంత‌గా ఆడ‌లేదు.

కపిల్ దేవ్

Telugu Anil Kumble, Brett Lee, Irfan Pathan, Kapil Dev, Sunil Gavaskar, Vinod Ka

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ముజ్ సే షాదీ క‌రోజీ, ఇక్బాల్ సినిమాల్లో చేశాడు.ఈ సినిమాలు రెండూ మంచి విజయం సాధించాయి.

వినోద్ కాంబ్లీ

Telugu Anil Kumble, Brett Lee, Irfan Pathan, Kapil Dev, Sunil Gavaskar, Vinod Ka

సునీల్ షెట్టితో కలిసి తను అన్నార్థ్ అనే సినిమాలో నటించాడు.2000లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

సునీల్ గవాస్కర్

Telugu Anil Kumble, Brett Lee, Irfan Pathan, Kapil Dev, Sunil Gavaskar, Vinod Ka

1980 లో మ‌రాఠి సినిమా సాల్వి ప్రేమాచిలో సునీల్ గవాస్కర్ నటించాడు.అప్పుడు ఆయన క్రికెటర్ గా కొనసాగుతున్నాడు.ఈ సినిమాలో తను ఓ పాట కూడా పాడాడు.ఈ సినిమా తనకు మంచి పేరు తెచ్చింది.

ఇర్ఫాన్ పఠాన్

Telugu Anil Kumble, Brett Lee, Irfan Pathan, Kapil Dev, Sunil Gavaskar, Vinod Ka

టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ఓ తమిళ చిత్రంలో నటించాడు.ఇందులో తను పరిశోధన అధికారి క్యారెక్టర్ చేశారు.ఈ సినిమా విజయం సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube