మనందరికీ తెలుసు వ్యాయామం శరీరానికి ఎంత మంచిదో.అలాగే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం చేయాలి అంటూ వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు.
ముఖ్యంగా గుండె జబ్బులు మన దరికి రాకూడదు అంటే వ్యాయామం ఎంతో అవసరం.శారీరకంగా ఫీట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ఎంతో అవసరం.
కానీ వ్యాయామం అధికంగా చేయడం వల్ల గుండె సమస్యలు వస్తాయని, అందుకే రోజుకు ఇంతసేపు మాత్రమే వ్యాయామం చేయాలని డాక్టర్లు చెబుతున్నారు.ఎందుకంటే వ్యాయామం చేస్తూ చాలామంది హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు అధికంగా గుండెపోటు కారణంగా చనిపోవడం మనం చూస్తూనే ఉన్నాం.అది కూడా వ్యాయామం చేస్తూ వాళ్ళు మరణించడం జరుగుతుంది.
వ్యాయామం చేస్తూనే వాళ్ళు మరణించడం వల్ల వ్యాయామం చేయడం వల్ల చనిపోతారనే భయం ప్రజల్లో ఏర్పడింది.
రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
ఇంతకుమించి వ్యాయామం చేస్తే హానికరం.అందుకే వైద్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఇలా వారంలో కనీసం ఐదు రోజులు చేయాలి.
అలాగే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉండాలి.అలాగే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివి ఖచ్చితంగా చేయాలి.
అయితే అధిక వ్యాయామాలు ఎక్కువగా బరువులు ఎత్తడం వంటివి గుండెకు మంచిది కాదు.

అందుకే కొత్తగా వ్యాయామం చేసేవారు ఒకేసారి అధికంగా వ్యాయామం చేయకుండా రోజుకు కొంచెం కొంచెం పెంచుతూ వ్యాయామం చేయాలి.ఇది అందరికీ ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ పలు జబ్బులు ఉన్న వారికి మాత్రం ఇది ప్రమాదంగా మారుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.అందులో ముఖ్యంగా హెచ్ఓసిఎం అనే వ్యాధి ఉన్నవారు అధిక వ్యాయామం చేయడం ప్రాణాంతకం.
అలాగే హార్ట్ బీట్ సంబంధ వ్యాధులు ఉన్నవాళ్లు కూడా అధిక వ్యాయామం చేయడం మంచిది కాదని చెబుతున్నారు.అందుకే రోజుకు తగినంత సేపు మాత్రమే వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.