పెదాలు గులాబీ రంగులో మెరుస్తూ ఉంటే ముఖం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.అందుకే తమ పెదాలు గులాబీ రంగులో అందంగా, మృదువుగా మెరిసిపోవాలని మగువలు తెగ ఆరాటపడుతుంటారు.
కానీ పెదవుల సంరక్షణ లేకపోవడం, మృత కణాలు పేరుకుపోవడం, ఆహారపు అలవాట్లు, డీహైడ్రేషన్ తదితర కారణాల వల్ల పెదాలు నల్లగా కాంతిహీనంగా మారుతుంటాయి.అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాను రెండు రోజులకు ఒకసారి పాటిస్తే పెదాలు ఎంత నల్లగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే గులాబీ రంగులోకి మారి అందంగా మెరుస్తాయి.
ఈ చిట్కాను పాటిస్తే లిప్ స్టిక్స్ పై ఆధార పడాల్సిన అవసరం కూడా ఉండదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటి అనేది చూసేయండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు గులాబీ పువ్వుల రేకులను తుంచి వేయాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసి మరోసారి కలపాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేసి వేళ్ళతో స్మూత్ గా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.కనీసం రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకుని ఆపై ఒక పది నిమిషాలు పెదాలను ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా పెదాలను క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ చిట్కాను కనుక పాటిస్తే పెదాల నలుపు వదిలిపోతుంది.పెదాలపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి.సహజంగానే మీ పెదాలు గులాబీ రంగులోకి మరి అందంగా మరియు ఆకర్షణీయంగా మెరుస్తాయి.పైగా ఈ సింపుల్ చిట్కాను పాటించడం వల్ల పెదాలు పొడి బారడం, పగలడం వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
పెదాలు మృదువుగా కోమలంగా మారతాయి.కాబట్టి తప్పకుండా ఈ చిట్కాను పాటించండి.
పెదాలను అందంగా మృదువుగా మెరిపించుకోండి.