1.వివేకా హత్య కేసు
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల కస్టడీపై వాదనలు ముగిశాయి.ఏ6 ఉదయ్ కుమార్, a7 వైఎస్ భాస్కర్ రెడ్డిని పది రోజుల కస్టడీకి ఇవ్వాలని సిబిఐ అధికారులు కోరారు.
2.ఓటు బ్యాంకు రాజకీయాలకు టీటీడీని వాడుకుంటున్నారు
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసే విధంగా సిమ్స్ ఉన్నతాధికారులు నిర్ణయాలు ఉన్నాయని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వాడుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి విమర్శించారు.
3.అతిక్ అహ్మద్ హత్య ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక బృందాలు
గ్యాంగ్ స్టర్ లు అతిక్ అహ్మద్, ఆఫ్రప్ ల హత్యోదాంతం పై ఉత్తరప్రదేశ్ పోలీసులు దర్యాప్తుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
4.గురుకుల పోస్టుల నోటిఫికేషన్
తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లోని ఖాళీ పోస్టుల భర్తీకి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు .మొత్తం 9231 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయనున్నారు.
5.పవన్ కళ్యాణ్ పై విమర్శలు
ఏపీ మంత్రులు వైసిపి నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన నేపథ్యంలో, మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని పవన్ పై విమర్శలు చేశారు.పవన్ కళ్యాణ్ ని జనం మర్చిపోతున్నారని, అప్పుడప్పుడు అందుకే ట్వీట్ లు పెడుతున్నారని పేర్ని నాని విమర్శించారు.
6. అహ్మద్ హత్య పై సుప్రీంకోర్టులో పిటిషన్ లు
గ్యాంగ్ స్టర్ పొలిటికల్ లీడర్ అహ్మద్ హత్య పై సుప్రీంకోర్టు పిటిషన్ లు దాఖలు అయ్యాయి.
7.రేవంత్ కి దక్కని ఆహ్వానం
కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇస్తున్న ఇప్తార్ విందుకు పార్టీ సీనియర్ నాయకులు అందరికీ ఆహ్వానాలు అందినా, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మాత్రం ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశంగా మారింది.
8.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
9.టేఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు
టీఎస్ పీ ఎస్సీ పేపర్ లీకేజీ ఘటన కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్ , రాజశేఖర్ రెడ్డి లను చాంచలగూడ జైల్లో ఈడి అధికారులు విచారించనున్నారు.
10.సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు నేడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు.
11.సిరిసిల్ల కు కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు.
12.ఐపీయేల్
బెంగళూరు వేదికగా ఈ రోజు రాత్రి 7.30 గంటలకు బెంగుళూరు – చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది.
13.జగన్ విజయవాడ పర్యటన
వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ నేడు విజయవాడలో పర్యటించరున్నారు.వన్ టౌన్, విద్యాపురంలోని మినీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొంటారు.
14.కోడి కత్తి కేసు విచారణ
నేడు విజయవాడ ఎన్.ఐ.ఏ కోర్టులో కోడి కత్తి కేసు విచారణ జరగనుంది.
15.ఇఫ్తార్ విందు
ప్రకాశం జిల్లా గిద్దలూరులో రంజాన్ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.
16.లోకేష్ పాదయాత్ర
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేడు 73వ రోజుకు చేరుకుంది.కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర కొనసాగుతోంది.
17.భారత్ సత్యాగ్రహ దీక్ష
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కలెక్టరేట్ ఎదుట భారత్ సత్యాగ్రహ దీక్ష జరుగుతుంది.ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు.
18.న్యాయవాదుల విధులు బహిష్కరణ
నేడు ఉమ్మడి కృష్ణాజిల్లాలో న్యాయవాదులు విధులు బహిష్కరించరున్నారు.సిఐడి పోలీసులు తీరును ఖండిస్తూ నిరసనకు న్యాయవాదులు పిలుపునిచ్చారు.
19.భట్టి విక్రమార్క పాదయాత్ర
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర నేడు 32వ రోజు పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతోంది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,940
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 61,030
.