తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను చేపట్టిన విషయం తెల్సిందే.రాష్ట్రం మొత్తంను లోకేష్ పాదయాత్రను( Lokesh Padayatra ) మొదలు పెట్టారు.
పాదయాత్రలో జనాలను కలిశాం.మాట్లాడాం వెళ్లి పోయాం అన్నట్లుగా కాకుండా లోకేష్ వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు.
ఆయన పర్యటిస్తున్న నియోజక వర్గం గురించి అన్ని విషయాలను తెలుసుకుని.
అక్కడ అధికార వైకాపా చేస్తున్న అవినీతి గురించి సాక్ష్యాలతో సహా సెల్ఫీ తీసుకుని షేర్ చేయడం మీడియా ముందు మాట్లాడటం చేస్తున్నాడు.ఇలా చేయడం వల్ల స్ధానికుల్లో మంచి ఆధరణ లభిస్తోంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.పార్టీ నాయకులకు మనో ధైర్యంను కల్పించడంలో కూడా నారా లోకేష్ సఫలం అవుతున్నాడు.
స్థానికంగా వైకాపా ఎమ్మెల్యేలు మరియు మంత్రులను బలహీన పర్చే విధంగా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరుతో లోకేష్ పాదయాత్ర కొనసాగబోతుంది.
కనుక తప్పకుండా భారీ ఎత్తున పార్టీకి బలం అంటూ స్వయంగా రాజకీయ విశ్లేషకులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.స్థానిక సమస్యలను లేవనెత్తుతూ స్థానిక వైకాపా నాయకుడి తీరును కూడా ఎండగట్టడం వల్ల కచ్చితంగా మంచి ప్రయోజనం ఉండటం తో పాటు రాబోయే ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు దక్కే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
లోకేష్ పాద యాత్ర మొదలు పెట్టే సమయంలో ఆ పార్టీ కి చెందిన నాయకుల్లో కూడా అనుమానం ఉండేది.కానీ ఇప్పటికే ఆ పార్టీ నాయకుల్లో ఆలోచన మారింది.లోకేష్ పాద యాత్ర వల్ల కచ్చితంగా అధికారంలో వస్తాం అని ఆ పార్టీ నాయకుల్లో నమ్మకం కలుగుతోంది.గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి అధికారాన్ని దక్కించుకున్న విషయం తెల్సిందే.
ఇప్పుడు లోకేష్ పాద యాత్ర వల్ల కూడా అధికారం వస్తుందని టీడీపీ నాయకులు నమ్మకంగా ఉన్నారు.