లోకేష్, చంద్రబాబు తోకలు కట్ చేస్తాం ! హెచ్చరించిన పిన్నెల్లి

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు , నారా లోకేష్ తోకలు కట్ చేస్తామంటూ వైసిపి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( Rama Krishna Reddy Pinnelli ) సంచలన విమర్శలు చేశారు .2024 ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని,  అప్పుడు చంద్రబాబు,  లోకేష్ తోకలు కట్ చేస్తామంటూ ఆయన హెచ్చరించారు.టిడిపి అధినేత చంద్రబాబు వల్లే ఏపీకి రాజధాని సమస్య వచ్చిందని పిన్నెల్లి మండపడ్డారు.నారా లోకేష్ వార్డ్ కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత 151 యొక్క అసెంబ్లీ సీట్లు గెలిచిన సీఎం జగన్( Cm jagan ) పై విమర్శలు చేయాలంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సూచించారు.

 Rama Krishna Reddy Pinnelli Comments On Chandrababu And Nara Lokesh , Pinnelli-TeluguStop.com

జగన్ పై విమర్శలు చేసే స్థాయి అసలు లోకేష్ కు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి( Y.S.Vivekananda Reddy ) హత్య వ్యవహారం పైన పిన్నెల్లి స్పందించారు.ఈ కేసులో సిబిఐ విచారణ మేరకు దోషులకు శిక్షలు పడతాయని,  దీనిని అనవసరంగా రాజకీయాలు చేయవద్దంటూ ఆయన హితువు పలికారు.

ప్రస్తుత ఏపీ రాజకీయ అంశాలతో పాటు ఆధ్యాత్మిక  తిరుమల కు వచ్చిన సందర్భంగా పిన్నెల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. టీటీడీ( TTD ) లో ఫైరవీలకి చెక్ పడింది అని, టీటీడీ నిర్ణయాలు సామాన్య భక్తులకు ప్రాధాన్య ఇచ్చే విధంగా ఉన్నాయని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశంసించారు.ఎవరో కొంతమందికి అసౌకర్యం కలిగినంత మాత్రాన , తిరుమల తిరుపతి దేవస్థానం పై విమర్శలు చేయడం మంచిది కాదంటూ పిన్నెల్లి అన్నారు.

ధర్మారెడ్డి ( Dharma Reddy )తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యతలు చేపట్టిన తర్వాత మంచి మార్పు చేర్పులే చోటు చేసుకున్నాయని ప్రశంసించారు.రాబోయే ఎన్నికల్లో పలనాడు జిల్లాలో ఏడుకు ఏడు స్థానాలలో వైసిపి గెలవబోతోందని పిన్నెల్లి జోస్యం చెప్పారు.పల్నాడు రాజకీయాలు ఎప్పుడు హీట్ గానే ఉంటాయి అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube