వర్షాకాలం( Monsoon ) అంటేనే జబ్బుల కాలం.మండుతున్న వేసవి తాపం తర్వాత వర్షాకాలం ఉపశమనంగా అనిపించవచ్చు.
కానీ వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉంటుంది.ఇది సూక్ష్మక్రిములు వృద్ధి చెందడానికి మరియు దోమల సంతానోత్పత్తికి ఎంతో అనుకూలమైన సమయం.
ఈ కాలంలో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధులు అత్యధికంగా విజృంభిస్తాయి.అలాగే జలుబు, దగ్గు మరియు ఇతర సీజనల్ వ్యాధులు ( Seasonal Diseases ) ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి.
కాబట్టి వర్షాకాలంలో జబ్బులకు దూరంగా ఉండాలంటే కచ్చితంగా మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాలి.

అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ ఒక ఇమ్యూనిటీ బూస్టర్ గా( Immunity Booster ) పనిచేస్తుంది.జబ్బుల నుంచి రక్షిస్తుంది.
మరి ఇంతకీ ఆ ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? ఏ సమయంలో తీసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ కాస్త హీట్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము,( Ginger ) రెండు దంచిన యాలకులు,( Cardamom ) రెండు లవంగాలు మరియు ఆరు నుంచి ఎనిమిది ఫ్రెష్ తులసి ఆకులు వేసుకుని దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన తేనె( Pure Honey ) కలిపితే మన ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది.రోజు ఉదయం పూట ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే అదిరిపోయే లాభాలు మీ సొంతం అవుతాయి.
ప్రధానంగా యాలకులు, లవంగాలు, అల్లం, తులసి ఆకుల్లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక వ్యవస్థను బలపరచడంలో అద్భుతంగా తోడ్పడతాయి.నిత్యం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల సీజనల్ గా వచ్చే వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
ఒకవేళ సీజనల్ జబ్బుల బారిన పడిన కూడా వాటి నుంచి త్వరగా కోలుకునేందుకు మన బలమైన రోగనిరోధక వ్యవస్థ మద్దతు ఇస్తుంది.ఇకపోతే ఈ ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది.
కొలెస్ట్రాల్ లో కరిగించి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.