ఇప్పటి హీరోయిన్స్ కి నిన్నటి తరం హీరోయిన్స్ కి చాల తేడాలు ఉంటాయి.ఇప్పుడు అయితే ఒకటి రెండు సినిమాల్లో కనిపిస్తే చాలు అనుకుంటున్నారు.
అందుకే వచ్చిన ఆఫర్ ఎలాంటిది అని కూడా చూడకుండా, ఎలా నటించామన్నా కూడా చేసేసి అడిగినదాని కన్నా ఎక్కువగా ముట్టచెప్తుండటం తో హ్యాపీ గా ఫీల్ అయిపోయి ఎలా అయితే వచ్చారో అలాగే ముంబై విమానం ఎక్కేసి వెళ్లిపోతున్నారు.కానీ నాటి రోజుల్లో అలా కాదు.
సినిమా అంటే డెడికేషన్, ఒక ఆరాటం ఉండేవి.బాగా కనిపించాలని, తమ పాత్ర బాగుండాలని, మంచి నటన కూడా ఉండాలని ఎంతో కష్టపడేవారు.
ఆలా చేయడం వల్లనే వారు పదులు, ఇరవైలు దాటి వందల సినిమాల్లో నటించేవారు.
ఇక సినిమాలతో పాటు పక్క హీరోయిన్స్ తో మంచి సంబంధాలు కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం.ఇప్పుడు సినిమాలు మొత్తం హైదరాబాద్ లోనే షూటింగ్ లు చేస్తున్నారు కానీ అప్పట్లో సినిమా ఇండస్ట్రీ అంత చెన్నై లోనే ఉండేది.అందుకే హీరోయిన్స్ అంత కూడా చెన్నై లో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకునేవారు.
ఇక ఇండస్ట్రీ కూడా ఆదివారం వచ్చింది అంటే షూటింగ్ కి సెలవు ఇచ్చేవారు.తమిళనాడు లో అప్పుడు ఆ పద్ధతి ఫాలో అయ్యేవారు.
కానీ ఇప్పుడు అలా ఏమి లేదు.అయితే ఆదివారం వచ్చిందంటే చాలు హీరోయిన్స్ అంత ఒక చోటకి చేరుకొని ఆటవిడుపు కోసం ఎన్ని గేమ్స్ ఆడేవారు.
మరి ముఖ్యం గా కొంత మంది హీరోయిన్స్ కి ఆటలు అంటే చాల ఇష్టం ఉండేది.రాధా కి స్విమ్మింగ్ అంటే మహా సరదా.చాల మంది హీరోయిన్స్ ఆమెతో స్విమ్ చేయడానికి పోటీ పడతారు కానీ ఆమె వేగాన్ని అందుకోలేరు.ఇక భాను ప్రియా అయితే హాకీ బాగా ఆడుతుంది.ఆమె హాకీ ఆడుతున్న కొన్ని సీన్స్ కి సినిమాల్లో కనిపిస్తాయి.జయప్రద చెస్ బాగా ఆడుతుంది.
అలాగే జయసుధ బిలియర్డ్ గేమ్ బాగా ఆడగలదు.సావిత్రి కి కార్ రేసింగ్ అంటే చాలా ఇష్టం.
విజయ శాంతికి టెన్నిస్ ఆటపై మంచి పట్టు ఉంది.ఇలా హీరోయిన్స్ అంత కూడా ఆదివారాలు కలిసి ఆటవిడుపు గా సమయాన్ని గడిపేవారు.