సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓ వింత జీవి( Strange Creature ) వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.మార్చి 27న ‘నేచర్ ఈజ్ అమేజింగ్’ అనే ఎక్స్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో, చాలా అరుదుగా కనిపించే ‘బ్యంకెట్ ఆక్టోపస్’( Blanket Octopus ) ఒకటి బీచ్‌కు అత్యంత సమీపంలో ఈదుతూ కనిపించింది.
సాధారణంగా ఇవి సముద్రపు లోతుల్లోనో, నడి సముద్రంలోనో ఉంటాయి.అలాంటిది ఇలా ఒడ్డుకు దగ్గరగా కనిపించడంతో జనం ఆశ్చర్యపోతున్నారు, అదే సమయంలో కొంచెం కంగారు కూడా పడుతున్నారు.
వీడియో కింద పెట్టిన క్యాప్షన్‌లో ఓ విషయం చెప్పారు.అదేంటంటే, ఈ బ్యంకెట్ ఆక్టోపస్‌లు సాధారణంగా సముద్రపు అడుగున ఉంటాయని, కానీ కొన్ని సంస్కృతుల్లో ఇవి ఇలా భూమికి దగ్గరగా వస్తే ఏదో కీడు జరగబోతోందని నమ్ముతారట.
ఇంకేముంది ఆన్‌లైన్‌లో రచ్చ మొదలైంది.ఇది రాబోయే విపత్తుకు ఏమైనా సంకేతమా? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
“యుగాంతం దగ్గరపడింది” ( Doomsday Is Near ) అనే మాట తెగ ట్రెండ్ అయిపోయింది.అరుదైన సముద్ర జీవులు కనిపిస్తే ఏదో అరిష్టం జరుగుతుందని పాతకాలం నుంచి ఉన్న నమ్మకాలను చాలామంది గుర్తుచేసుకుంటున్నారు.ఈ వీడియో క్షణాల్లో వైరల్( Viral Video ) అయింది, వేలల్లో కామెంట్లు వచ్చి పడ్డాయి.కొందరు ఆ ఆక్టోపస్ అందానికి ఫిదా అయిపోతే, మరికొందరు మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు.
“వావ్, బ్యంకెట్ ఆక్టోపస్‌కు జెల్లీఫిష్‌ల విషం కూడా ఏం చేయలేదు.దీనిలో మొత్తం నాలుగు జాతులే ఉన్నాయి.దీన్ని చూడటమే మహా అరుదు” అని ఒకరు అన్నారు.“ప్రకృతి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది, ఇంత అరుదైన జీవిని ఇంత దగ్గరగా చూడటం భలే ఉంది.” అని మరో యూజర్ కామెంట్ పెట్టారు.“అంత లోతులో ఉండే జీవి ఒడ్డుకు ఇంత దగ్గరగా రావడమా? ఇదేదో తేడాగా ఉందే.దీని అర్థం ఏంటి?” అని ఇంకొకరు అన్నారు.
దాని ఒంటిపై శాలువా కప్పుకున్నట్టుగా పొరలు ఉంటాయి కాబట్టే దీనికి ‘బ్యంకెట్ ఆక్టోపస్’ అని పేరు వచ్చింది.
అది ఈదుతున్నప్పుడు ఆ పొరలు ఎంతో అందంగా కదులుతూ కనిపిస్తాయి.దీనికి జెల్లీఫిష్‌ల విషం అంటే లెక్కే లేదు, వాటిని పట్టుకుని కొన్నిసార్లు ఆయుధంగా కూడా వాడుకుంటుందట.
అయితే, ఇది సముద్రం లోతుల్లో నివసించే జీవి కాబట్టి, ఇలా ఒడ్డుకు దగ్గరగా కనిపించడం మాత్రం చాలా చాలా అసాధారణమైన విషయం.
ఈ వింత సంఘటన వెనుక అసలు కారణం ఏంటో నిపుణులకు కూడా సరిగ్గా అర్థం కావడం లేదు.
కానీ, ఈలోపే ఇంటర్నెట్‌లో మాత్రం దీని గురించి పెద్ద చర్చే నడుస్తోంది.జనం రకరకాలుగా ఊహించుకుంటూ ఆశ్చర్యపోతున్నారు.