ఫోర్బ్స్ జాబితా ...రష్మిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా... బాగానే వెనకేసిన నటి!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ( Rashmika Mandanna )ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఒకవైపు తెలుగు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అవుతున్నారు.

 Forbes Reveals Rashmika Total Assets Full Details Here , Rashmika, Assets, Tolly-TeluguStop.com

అయితే ఈమె నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల వరుసగా ఈమె సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు.

పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే బాలీవుడ్ చిత్రం ఛావా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈ సినిమా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ఇక త్వరలోనే ఈమె సల్మాన్ ఖాన్( Salman Khan ) సరసన నటించిన సికిందర్ ( Sikindar )సినిమా కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

ఈ సినిమా రంజాన్ పండుగను పురస్కరించుకొని మార్చి 30 తేదీ విడుదల చేయబోతున్నారు.ప్రస్తుతం రష్మిక సికిందర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Telugu Assets, Forbesreveals, Rashmika, Sikindar, Tollywood-Movie

ఇదిలా ఉండగా వరుస సినిమాలలో నటిస్తూ రష్మిక  భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది.ఈమె ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అయితే ఇటీవల వరుస హిట్ సినిమాలు కావడంతో ఈమె రెమ్యూనరేషన్ కూడా పెంచారని తెలుస్తుంది.ఇలా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ రష్మిక భారీగానే ఆస్తులు ( Assets )కూడ పెట్టినట్టు సమాచారం.తాజాగా ఈమె ఆస్తుల గురించి ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది.

Telugu Assets, Forbesreveals, Rashmika, Sikindar, Tollywood-Movie

ఈ జాబితా ప్రకారం.కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక వయసు 28.కానీ ఆస్తి మాత్రం రూ.66 కోట్ల వరకు సంపాదించిందని ఫోర్బ్స్ చెప్పుకొచ్చింది.ఒక్కో సినిమాకు రూ.4-8 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటుందని పేర్కొంది.ఈమె ఆస్తి రూ.100 కోట్లకు చేరొచ్చని అంచనా.వీటితో పాటు రష్మిక మరోవైపు యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది.హైదరాబాద్, ముంబై, బెంగళూరు, గోవా, కూర్గ్ లో ఈమెకు సొంత ఫ్లాట్స్ ఉన్నాయి.మొత్తానికి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే రష్మిక భారీగానే ఆస్తులను కూడా పెట్టిందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube