సోషల్ మీడియా జనాల జీవితాల్లోకి అడుగు పెట్టిన తరువాత ప్రపంచమే ఓ కుగ్రామం అయిపోయింది.ఈ క్రమంలోనే ఏ మూలన జరిగిన ఏ చిన్న విషయం అయినా యిట్టె తెలిసి పోతోంది.
తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో( Uttar Pradesh ) జరిగిన విచిత్ర ఘటన ఒకటి అవాక్కల్యేలా చేస్తోంది.తన భార్య మరో వ్యక్తిని ప్రేమించి, అతడితోనే ఉంటానని చెప్పడంతో భర్త.
ఆమె పరిస్థితిని పెద్ద మనసుతో అర్ధం చేసుకొని వారిద్దరికీ పెళ్లి జరిపించారు.అంతే కాకుండా.
తమ ఇద్దరు పిల్లలను తానే పోషిస్తానని కూడా సదరు భర్త ఒప్పుకోవడం అతని ఔదార్యానికి ప్రతీక అని చెప్పుకోవచ్చు.దీంతో, ఈ ఘటన స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే… యూపీలోని సంత్ కబీర్ నగర్ గ్రామానికి చెందిన బబ్లూ( Bablu ) 2017లో గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన రాధికను( Radhika ) పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు.కాగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.అయితే, బబ్లూ జీవనోపాధి కోసం మరోచోట పని చేయవలసి వచ్చింది.ఈ క్రమంలో రాధిక.అదే గ్రామానికి చెందిన మరో యువకుడితో ప్రేమాయణం సాగించింది.అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ సంబంధం క్రమంగా గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.వీరి ప్రేమ వ్యవహారం భర్త బబ్లూకు కూడా తెలియడంతో భార్యను మందలించాడు బబ్లు.
కానీ, ఆమె దానికి అంగీకరించక.ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది.

ఈ నేపథ్యంలో బబ్లూ. నా భార్య నాతో జీవించాలా? లేక తన ప్రేమికుడితో పంపించేయాలా? అని తెగ అలోచించి… గ్రామస్తుల ముందు పంచాయితీ పెట్టాడు.ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి జీవించాలనే కోరికను వ్యక్తం చేయగా సమాజం నివ్వెరపోయింది.భార్య ప్రవర్తన కారణంగా చేసేదేమీ లేకపోవడంతో.ముందుగా భర్త తన భార్యతో కలిసి నోటరీ పబ్లిక్ కోర్టుకు హాజరయ్యాడు.ఆపై తన భార్యను ఆమె ప్రియుడితో ఒక ఆలయంలో రెండో వివాహం జరిపించేశాడు.
ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది.కానీ సదరు మహిళ పిల్లలను సైతం ప్రియుడి కోసం అవాయిడ్ చేసింది.
దాంతో మొదటి భర్త తన భార్యతో కలిగిన సంతానాన్ని తనతోనే పోషిస్తానని చెప్పాడు.దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.