బుచ్చిబాబు, రామ్ చరణ్ (Buchi Babu, Ram Charan)కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు.
మొదటి నుంచి వినిపించినట్టుగానే ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ని ఖరారు చేసిన విషయం తెలిసిందే.తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా(Ram Charan’s birthday) ఈ సినిమా టైటిల్ ని అలాగే రామ్ చరణ్ కి సంబంధించిన లుక్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పొందుతున్న పెద్ది సినిమాపై తాజాగా నిర్మాత రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల గ్లింప్స్ చూశానని, ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు.ప్రత్యేకంగా రూపొందించిన ఒక సన్నివేశం కోసమైనా గ్లింప్స్‌ను ప్రేక్షకులు కనీసం 1000 సార్లు చూస్తారని అభిప్రాయపడ్డారు.నితిన్ హీరోగా(Nithin as the hero) తాను నిర్మించిన రాబిన్ హుడ్ (Robin Hood)సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడారు.ఈ సందర్భంగా నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.
మేం నిర్మిస్తున్న పలు భారీ బడ్జెట్ చిత్రాలు 2026లో విడుదల కానున్నాయి.అవే ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్, రామ్ చరణ్, బుచ్చిబాబు, ప్రభాస్,హను రాఘవపూడి, రిషబ్‌శెట్టి, ప్రశాంత్ వర్మ, విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్, పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ చిత్రాలు.

జై హనుమాన్ సినిమా చిత్రీకరణలో రిషబ్ శెట్టి నవంబరులో పాల్గొంటారు.2026 మాకెంతో ప్రత్యేకం కానుంది అని పేర్కొన్నారు.పుష్ప 2 విషయంలో ప్రసాద్ మల్టీప్లెక్స్ తో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందిస్తూ.పాలసీ విషయంలో అప్పుడు చిన్న సమస్య ఎదురైందని అన్నారు.అది సీరియస్ మ్యాటర్ కాదని తెలిపారు.రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్ సినిమా #RC16 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే.
చరణ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఉదయం 9:09 గంటకు ఆ మూవీ టైటిల్ ను ప్రకటించడంతోపాటు ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసారు.అయితే పెద్ది సినిమా గురించి మాట్లాడుతూ సినిమాలో ఒక సన్నివేశం కోసం అయినా సినిమాను వెయ్యిసార్లు చూస్తారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రవిశంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.