కోవిడ్ కొత్త లక్షణాలు.. టీకా వేసిన వారిలో కూడా కనిపిస్తున్నాయా..

గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ 19 సమస్య ఇప్పటివరకు కూడా ప్రపంచం నుంచి పూర్తిగా దూరం అవ్వలేదు.అయితే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కోవిడ్ కేసులు కాస్త తగ్గాయే అని చెప్పవచ్చు.

 New Symptoms Of Covid Are They Also Seen In Those Who Have Been Vaccinated , New-TeluguStop.com

కానీ ఈ వైరస్ ని మాత్రం ఏ దేశం కూడా పూర్తిగా నాశనం చేయలేకపోయింది.ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి తీవ్రత ఎక్కువగా ఉంది.

కాబట్టి ఈ సమయంలో కూడా ఈ వైరస్ బయటపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అత్యధిక సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అవుతున్న దేశాలు ఇప్పటికి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి.

అయితే ఈ దేశాలలో కోవిడ్ వైరస్ మళ్ళీ కొత్త కొత్త లక్షణాలతో కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

కేసులు మళ్లీ ఎందుకు పెరుగుతున్నాయంటే కోవిడ్ వైరస్ అలాగే కొత్త లక్షణాలతో మళ్లీ ఈ వైరస్ బలం పుంజుకొని ఈ ప్రపంచం పై దాడి చేసే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

కోవిడ్ 19 ముందు వచ్చినప్పుడు గొంతు నొప్పి కోవిడ్ ప్రధాన లక్షణంగా ఉండేది.అయితే ఇప్పుడు మాత్రం కరోనా వైరస్ ప్రధాన లక్షణం గొంతు నొప్పి, దగ్గు కాదు జ్వరం అని తాజా అధ్యయనంలో తెలిసింది.

దాదాపు 200 మందికి పైగా కోవిడ్ వచ్చినప్పుడు వారికి ఉన్న ప్రధాన లక్షణాలలో జలుబుతో పాటు జ్వరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు.

Telugu Covid, Tips, Symptoms-Latest News - Telugu

పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తిలలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు.ఇది కాకుండా వైరస్ వ్యాపించిన వారిలో సాధారణ లక్షణాలు ఇలా ఉన్నాయి.దీర్ఘకాలిక దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు నొప్పి, ముక్కు కారటం, తలనొప్పి, అలసట, వాసన, రుచి కోల్పోవడం, వికారం, విరోచనాలు లాంటి ఎన్నో లక్షణాలు ఉన్నాయి.

ఆరోగ్య సమస్యలను నివారించడానికి కోవిడ్ తో సంబంధం ఉన్న వివిధ లక్షణాలను అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి.ఈ లక్షణాలను అర్థం చేసుకొని త్వరగా చికిత్స తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube