టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన (National Crush Rashmika Mandanna)గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ రష్మిక(Rashmika).
ఇటీవల కాలంలో రష్మిక నటించిన సినిమాలు అన్ని వరుసగా సూపర్ హిట్ అవుతుండడంతో ఈమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్(Tollywood) లో వరుస సినిమాలను అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ, యానిమల్(Animal) సినిమాతో బాలీవుడ్ లో కూడా సత్తా చాటింది.

అలా బాలీవుడ్ లో కూడా భారీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకు అక్కడ కూడా వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.దీంతో ప్రస్తుతం చేతునిండా బోలెడు సినిమా అవకాశాలతో ఫుల్ బిజీబిజీగా ఉంది రష్మిక మందన.ఒక చివరగా తెలుగులో పుష్ప 2 (pushpa 2)మూవీతో ప్రేక్షకులను పలకరించగా, హిందీలో చావా మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు జోడీగా సికిందర్ అనే సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది.
ఇదిలా ఉంటే రష్మీక మందన్న గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇంతకీ రష్మిక ఏం మాట్లాడింది అన్న విషయానికి వస్తే.

తన చిన్న తనంలో ఆర్థిక సమస్యల కారణంగా తన తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారట.అద్దె ఇల్లులో నివసిస్తూ, కొన్నిసార్లు ఆర్థిక ఒడిదొడుకుల వల్ల సాధారణ ఖర్చులను కూడా భరించడం కష్టమైన సందర్భాలు ఉన్నాయని ఆమె తెలిపింది.ఈ నేపథ్యంలోనే రష్మిక తన కెరీర్ ను మోడలింగ్ తో ప్రారంభించిందట.ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టిందట.అలాగ 2016 లో కిరిక్ పార్టి అనే కన్నడ చిత్రంతో నటిగా తొలి అడుగు వేసిన రష్మిక, క్రమంగా తన ప్రతిభతో సౌత్ సినిమా పరిశ్రమలో అగ్ర నటిగా ఎదిగింది.రష్మిక తన విజయం వెనుక తన తల్లిదండ్రుల త్యాగాలు, ప్రోత్సాహం ఉన్నాయని తరచూ చెప్తూ ఉంటుంది.
ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, ఆమె చదువుకు, కలలకు మద్దతుగా నిలిచారని తెలిపింది.అలాగే గతంలో తన తండ్రి గురించి ఇన్‌స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ లలో కూడా పంచుకుంది.
ఆయన ప్రేమ, మద్దతు తన జీవితంలో ఎంత ముఖ్యం అని వివరించింది.రష్మిక మందన్న తన తల్లిదండ్రుల కష్టాలను గుర్తు చేసుకుంటూ, వారి స్ఫూర్తితోనే తాను ఈ స్థాయికి చేరానని చెప్పుకొచ్చింది.