అల్లు అర్జున్.పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
పాన్ ఇండియన్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు.తమిళంతో పాటు హిందీలనూ మంచి విజయాన్ని నమోదు చేసింది.
ఎలాంటి అంచనాలు లేకండా హిందీలో రిలీజ్ అయిన పుష్ప ఇప్పటికే ఓటీటీలోనూ వచ్చింది.ఏకంగా 85 కోట్ల రూపాయలను వసూళు చేసింది.
ఇక తమిళంలోనూ ఇప్పటికే 30 కోట్లు సాధించింది.ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లు కలెక్ట్ చేసింది.
ఇక ఈయన ఫ్యామిలీ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి.
నల్లగొండ జిల్లాకు చెందిన అమ్మాయి.ప్రేమ వివాహం చేసుకున్నాడు.
సోషల్ మీడియాలోనూ బన్నీ సతీమణికి మంచి ఫాలోయింగ్ ఉంది.ఆమె నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటుంది.
తనకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ఇందులో పెడుతుంది.ఇక స్నేహారెడ్డి ఎవరు.? ఆమెకు బన్నీకి ఎక్కడ పరిచయం ఏర్పడింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
స్నేహ 1985 సెప్టెంబర్ 29న జన్మించింది.వయసు 36 ఏండ్లు.హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు.
స్నేహారెడ్డి తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త.ఇతడికి కాలేజీలు కూడా ఉన్నాయి.పెళ్లికి ముందు స్నేహ ఆ కాలేజీలను చూసుకునేది.తండ్రి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు.2014లో ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.ఆమె తల్లి కవితారెడ్డి.
స్నేహకు ఓ సోదరి ఉంది.స్నేహ ఇంగ్లండ్ లో చదివింది.
కేంబ్రిడ్జి యూనివర్సిటీలో కంప్యూటర్స్ లో మాస్టర్ డిగ్రీ చేసింది.స్నేహ ఫేవరెట్ హీరో బన్నీ.
హీరోయిన్ అలియా భట్.ఈమెకు సోషల్ మీడియాలో నాలుగు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.అటు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.అటు తన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటుంది.ఫ్యామిలీ లైఫ్ లోనూ బిజీగా ఉంటుంది స్నేహ.