టాలీవుడ్ స్టార్ హీరోలు పైరసీకి వ్యతిరేకంగా పోరాడలేరా.. అలా చేయడం సాధ్యం కాదా?

టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీని వేధిస్తున్న సమస్యలలో పైరసీ ఒకటి.భారీ బడ్జెట్ సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్నా పైరసీ వల్ల పెద్ద సినిమాలు తీవ్రస్థాయిలో నష్టపోతున్నాయి.

 Tollywood Star Heroes Against Piracy Details Inside Goes Viral In Social Media ,-TeluguStop.com

టాలీవుడ్ స్టార్ హీరోలు పైరసీకి వ్యతిరేకంగా పోరాడలేరా అనే ప్రశ్నలు సైతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.టాలీవుడ్ స్టార్స్ తలచుకుంటే కొన్ని పైరసీ సైట్లను బ్యాన్ చేయించడం కష్టమేం కాదు.

ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీకే ఈ పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇండస్ట్రీలో ఒకరో ఇద్దరో పోరాడితే ఈ సమస్య పరిష్కారం కాదు.అందరూ కలిసికట్టుగా పోరాడితే మాత్రమే సమస్య పరిష్కారమవుతుంది.మారుతున్న టెక్నాలజీ వల్ల అద్భుతమైన క్వాలిటీతో పైరసీ సైట్లలో( piracy sites ) ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు దర్శనమిస్తున్నాయి.

Telugu Ott, Piracy Sites, Tollywood, Tollywoodheroes-Movie

ఓటీటీలలో రిలీజ్ ( OTT Release )కావడానికి ముందే ఫుల్ క్లారిటీతో సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి.టాలీవుడ్ స్టార్స్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.టాలీవుడ్ స్టార్ హీరోలకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.పైరసీ సైట్లు మహా అంటే 4 నుంచి 5 ఉంటాయనే సంగతి తెలిసిందే.

Telugu Ott, Piracy Sites, Tollywood, Tollywoodheroes-Movie

వాటి సర్వర్లు ఎక్కడ ఉన్నా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ మరింత పెరగాలంటే మాత్రం టాలీవుడ్ స్టార్స్ కలిసికట్టుగా ముందడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది.టాలీవుడ్ స్టార్ హీరోలు పైరసీ సినిమాలకు వ్యతిరేకంగా ఉద్యమించకపోతే భవిష్యత్తులో నష్టపోక తప్పదు.టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రతి సంవత్సరం పైరసీ వల్ల వేల కోట్ల రూపాయలు నష్టపోతుండటం గమనార్హం.

దర్శకనిర్మాతలకు సైతం ఈ విషయాలు తెలుసు.కొందరు నిర్మాతలు తమ సినిమాలు పైరసీ కాకుండా డబ్బులు చెల్లించిన సందర్భాలు సైతం ఉన్నాయి.

రాబోయే రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి మారుతుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube