ఈ రోజుల్లో డిజిటల్ మ్యాప్స్ అందుబాటులోకి రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు తిరిగేస్తున్నారు.ఒకప్పుడు ఫిజికల్ మ్యాప్స్ అందుబాటులో ఉండేవి.
ప్రజలు వాటిని ఫాలో అవుతూ వెళ్లేవారు.దానికంటే ముందు ఇలాంటివి ఏవీ లేవని మనం అనుకుంటాం కానీ అది నిజం కాదు.
తాజాగా ప్రపంచంలోనే అతి పురాతనమైన 3D మ్యాప్ ను( World’s Oldest 3D Map ) పరిశోధకులు కనిపెట్టారు.ఫ్రాన్స్ రాజధాని పారిస్( Paris ) దగ్గర ఉన్న సెగొనోల్ 3( Segognole 3 ) అనే రాతి గుహలో దీన్ని గుర్తించారు.
సుమారు 13,000 ఏళ్ల కిందటి ఈ మ్యాప్ మన పూర్వీకులు తమ చుట్టుపక్కల ప్రదేశాన్ని ఎంత బాగా అర్థం చేసుకునేవారో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.
ఈ సెగొనోల్ 3 ప్రదేశం 1980ల నుంచే గుర్తింపు పొందింది.
అక్కడ చెక్కిన రెండు గుర్రాల బొమ్మలు, ఒక ఆడ బొమ్మ అప్పట్లో బాగా పాపులరయ్యాయి.అయితే, ఇప్పుడు అక్కడే దొరికిన ఈ కొత్త మ్యాప్ మాత్రం ఆ ప్రదేశం చుట్టూ ఉన్న నేలను చిన్న స్థాయిలో చూపిస్తోంది.
పాత రాతియుగం నాటి మనుషుల నైపుణ్యాలు, వారికి ప్రపంచం గురించి ఉన్న అవగాహన ఏంటో ఈ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ మెడార్డ్ థిరీ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.వారు చేసిన పరిశోధన “ఆక్స్ఫర్డ్ జర్నల్ ఆఫ్ ఆర్కియాలజీ”లో ప్రచురితమైంది.ప్రాచీన మానవులు( Ancient Humans ) నీటి ప్రవాహాన్ని, భూమి ఆకృతులను చూపించడానికి ఆ రాతిని ఎలా మలిచారో ఈ పరిశోధనలో వివరించారు.
డాక్టర్ ప్రకారం, ఇది మనం ఇప్పుడు వాడుతున్న మ్యాప్ లాంటిది కాదు.ఇది ఒక త్రీడీ మోడల్ లాంటిది.లోయల నుంచి నీరు ఎలా ప్రవహిస్తుంది, నదులు, సరస్సులు, చిత్తడి నేలలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తుంది.ఆ రోజుల్లో మనుషులకు దూరం, దారి తెలుసుకోవడం కంటే నీటి ప్రవాహం, భూమి ఎలా ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా!
డాక్టర్ థిరీ మాట్లాడుతూ, ఈ మ్యాప్ ను తయారు చేసినవారికి ఎంతో తెలివితేటలు, నైపుణ్యాలు ఉన్నాయని అన్నారు.
ఆ రాతిపై చెక్కిన గుర్తులు నీరు, జీవితానికి సంబంధించిన చిహ్నాలుగా కూడా ఉండొచ్చు.ఈ ఆవిష్కరణతో ఇంతకు ముందున్న నమ్మకాలు మారిపోయాయి.ఇంతవరకు కంచు యుగానికి చెందిన 3,000 సంవత్సరాల నాటి ఒక రాయిని ప్రపంచంలోనే అతి పురాతనమైన 3D మ్యాప్‌గా భావించేవారు.కానీ, ఇప్పుడు ఈ కొత్త మ్యాప్ ఆ రికార్డును బద్దలు కొట్టింది.
ఈ పరిశోధన పాత రాతియుగం నాటి మనుషుల తెలివితేటలకు నిదర్శనం.