అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ట్రంప్ హోదాకు , దర్పానికి ఎలాంటి లోటు లేకుండా ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వాషింగ్టన్ డీసీలో( Washington DC ) జరిగే ఈ కార్యక్రమంలో అమెరికా 47వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఆ రోజు వాతావరణం చాలా చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.10 డిగ్రీల ఉష్ణోగ్రతతో శీతల గాలులు వీస్తాయని.ఇది గడిచిన 40 ఏళ్లలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య జరుగుతున్న ప్రమాణ స్వీకారంగా నిపుణులు చెబుతున్నారు.
అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి( Donald Trump Inauguration ) ఏయే దేశాధినేతలు హాజరవుతున్నారు? సెలబ్రెటీల లిస్ట్ ఇదేనంటూ రకరకాల కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అమెరికన్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి మ్యూజిక్ సూపర్‌స్టార్ క్యారీ అండర్‌వుడ్( Carrie Underwood ) ఈ కార్యక్రమంలో అమెరికా ద బ్యూటీఫుల్ సాంగ్‌ను ఆలపించనున్నారు.
అలాగే క్రిస్టోఫర్ మ్యాకో, రాస్కెల్ ఫ్లాట్స్, గావిన్ డె గ్రా, కిడ్ రాక్, జాసన్ అల్డెన్, గ్రీన్‌వుడ్ వంటి రాక్ స్టార్స్, హాలీవుడ్ నటీనటులు హాజరుకానున్నారు.
వీరు కాకుండా వాకా ఫ్లోకా ఫ్లేమ్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్,( Elon Musk ) మెటా సీఈవో మార్చ్ జుకర్‌బర్గ్,( Mark Zuckerberg ) అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్,( Jeff Bezos ) నటుడు సిల్వెస్టర్ స్లాలోన్, లోగాన్ అండ్ జాక్ పాల్, బ్రేస్ హాల్, అంబర్ రోజ్, అంటోనియా బ్రౌన్, కార్టర్ ఫ్యామిలీ, మేఘన్ కెల్లీ తదితరులు హాజరుకానున్నారు.అలాగే పలువురు దేశాధినేతలు, రాయబారులు, ఉన్నతాధికారులు, మాజీ అధ్యక్షులు హాజరవుతారని అంచనా.అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు.ప్రమాణ స్వీకారానికి ముందే అమెరికా కొత్త అధ్యక్ష , ఉపాధ్యక్షులైన డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్‌ల అధికారిక చిత్రపటాలు కూడా సిద్ధమైపోయాయి.ఇప్పటికే అన్ని ప్రభుత్వ యంత్రాంగాలకు ఇవి అందినట్లుగా వార్తలు వస్తున్నాయి.సీరియస్‌గా చూస్తున్న ట్రంప్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.2023 నాటి ట్రంప్ ప్రఖ్యాత ముగ్‌షాట్‌ను పోలీ ఉంటుంది.