చలికాలంలో ఖర్జూరాలను ఖచ్చితంగా తినాలి.. ఎందుకో తెలుసా?

ఖర్జూరాలు.వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

ఏడాది పొడవునా విరి విరి గా లభ్యం అయ్యే ఖర్జూరాలు మధురమైన రుచితో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాలుష్యం, విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్ తో సహా బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటాయి.అందుకే ఆరోగ్యపరంగా ఖర్జూరాలు అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

ముఖ్యంగా ప్రస్తుత చలికాలంలో రోజుకు కనీసం మూడు నుంచి ఐదు ఖర్జూరాలను ఖ‌చ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.ఎందుకంటే చలికాలంలో అధికంగా ఇబ్బంది పెట్టే జలుబు, ద‌గ్గు, ఫ్లూ, శ్వాస సంబంధిత సమస్యలకు ఖర్జూరాలు స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకట్ట వేయగలవు.

ప్రతి రోజూ వీటిని తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.దీంతో ఆయా సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Advertisement

అలాగే మిగిలిన సీజన్లతో పోలిస్తే చలికాలంలో గుండెపోటు వచ్చే రిస్క్ చాలా ఎక్కువ.అయితే ఈ రిస్క్ ను తగ్గించడానికి ఖర్చురాలు సహాయపడతాయి.

రెగ్యుల‌ర్ గా ఖర్జూరాల‌ను తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుడ్‌ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.దాంతో మీ గుండె పదిలంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది.

అంతేకాదు ప్రస్తుత చలికాలంలో రోజుకు మూడు నుంచి ఐదు ఖర్జూరాలు తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యకు దూరంగా ఉండవచ్చు.అధిక రక్తపోటు బారి నుంచి బయటపడొచ్చు.

చలికాలంలో చాలా మంది గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో ఎక్కువగా బాధపడుతుంటారు.అయితే వీటికి చెక్ పెట్టడంలో ఖ‌ర్జూరాలు గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.రోజు ఖర్జూరాలను తీసుకుంటే అందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగ్గా మారుస్తాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

దీంతో ఆయా జీర్ణ సంబంధిత సమస్యలు తరచూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.కాబట్టి ప్రస్తుత చలికాలంలో తప్పకుండా ఖ‌ర్జూరాల‌ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.ఆరోగ్యంగా ఉండండి.

Advertisement

తాజా వార్తలు